టీఆర్టీసీలో సమ్మె సైరన్

 

హైద్రాబాద్, సెప్టెంబర్ 21   (globelmedianews.com)
ఆర్టీసీలో మరోసారి సమ్మె సైరన్ మోగింది. ఆర్టీసీ యాజమాన్యానికి   జేఏసీ సమ్మె నోటీసు అందించింది. సెప్టెంబర్ 23 నుంచి సమ్మె చేయనున్నట్లు నేతలు ప్రకటించారు. తమ డిమాండ్లనునెరవేర్చకపోతే సమ్మె ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అదే జరిగితే బతుకమ్మ, దసరా పండగ ముందు ప్రజలకు ఇక్కట్లు తప్పవు.ఆర్టీసీని నిర్వీర్యం చేస్తున్నారని టీఎస్ ఆర్టీసీ జేఏసీ కన్వీనర్అశ్వత్థామ రెడ్డి మండిపడ్డారు. ఏపీలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారని.. తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకోకుండా తాత్సారం చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రివర్గ ఉపసంఘంసూచించిన హామీలను నెరవేర్చలేదని తెలిపారు. సకల జనుల సమ్మెలో ఆర్టీసీ కార్మికులు 20 రోజులు పోరాడిన విషయాన్ని గుర్తుచేశారు.
టీఆర్టీసీలో సమ్మె సైరన్

ఆర్టీసీని నష్టాల పేరుతో బద్నాం చేస్తున్నారని అశ్వత్థామ రెడ్డితెలిపారు. సంస్థ నష్టాల్లో లేదని.. ఓఆర్ పెరిగిందని వివరించారు. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా నష్టాల పేరు ఎత్తుతోందని ఆరోపించారు. ఆర్టీసీని నిర్వీర్యం చేసేందుకు సంస్థపై ‘పిచ్చికుక్క’గా ముద్రవేసే కుట్ర జరుగుతోందన్నారు. కార్మికులు దినదిన గండంగా కాలం వెళ్లదీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.అన్ని సంఘాలు కలిసి పోరాటం చేయాలని నిర్ణయించినట్లు అశ్వత్థామ రెడ్డి తెలిపారు. 23,24 తేదీల్లో డిపోల ముందు ధర్నాలు తలపెట్టినట్లు చెప్పారు. లాభనష్టాలతో సంబంధం లేకుండా సంస్థను ప్రభుత్వం కాపాడాలని డిమాండ్ చేశారు.ఆర్టీసీని విలీనం చేసేందుకు ప్రభుత్వం 2013లోనేకమిటీ వేసింది. దీనిపై అధికారులు హర్యానా, పంజాబ్ వెళ్లి అధ్యయనం చేశారు. నివేదిక సమర్పించారు. విలీనం చేయాలి. కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలి. ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమం తీవ్రతరం చేస్తాం’ అని కోకన్వీనర్ రాజిరెడ్డి హెచ్చరించారు.కార్మికులను తగ్గించినా ఆదాయం పెంచామని జేఏసీ నాయకులు తెలిపారు. ఆర్టీసీకి ప్రభుత్వం రూ.3 వేల కోట్లకు పైగా ఇవ్వాలని డిమాండ్చేశారు. పన్నుల రూపంలో ప్రభుత్వానికి ఆర్టీసీ 3.6 కోట్లు చెల్లిస్తోందని తెలిపారు. అందరికీ పన్ను మినహాయింపులు ఇచ్చి ఆర్టీసీకి ఎందుకు వేస్తారని నిలదీశారు. సామాజిక బాధ్యతగా సర్వీసులనునడుపుతున్నామని తెలిపారు.ఇతర రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఈక్విటీల రూపంలో ప్రోత్సాహకాలు ఇస్తున్నాయని జేఏసీ నాయకులు తెలిపారు. ప్రభుత్వం నుంచి రూ.2200 కోట్లు రావాల్సి ఉందన్నారు.నష్టాలకు కారణం ప్రభుత్వమేనని ఆరోపించారు. ప్రభుత్వం ఆదుకోకపోవడంతోనే ఆర్టీసీకి నష్టాలు వస్తున్నాయని తెలిపారు. పక్క రాష్ట్రంలో ప్రభుత్వంలో విలీనం చేస్తా అని మాట ఇచ్చినిలబెట్టుకున్నారని గుర్తుచేశారు. రూ.50 వేల కోట్ల ఆస్థులున్న సంస్థను దెబ్బకొట్టాలని చూస్తే ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు.

No comments:
Write comments