టీడీపీవి దొంగ నాటకాలు

 

తాడేపల్లి సెప్టెంబర్ 04 (globelmedianews.com)
రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్లాలనే తపనతోపనిచేస్తున్న వైయస్ జగన్ ఆహ్వానించకపోగా కుట్రలు పన్నుతున్నారు. పారదర్శకంగా సాగుతున్న  జగన్ పరిపాలనచూసి ఓర్వలేకపోతున్నారు. పెయిడ్ ఆర్టిస్ట్ లతో ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని ప్రభుత్వ ఛీఫ్ విప్ శ్రీ గడికోట శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు. బుధవారం అయన మీడియాతో మాట్లాడారు. అవినీతికి ఆమడదూరంలో ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. టిడిపి ఎంఎల్ ఏలు ఐధేళ్లు మాఫియాపాలన నడిపారు. మీరు చేసిన అరాచకాలను ఎవ్వరూ కూడా మరిచిపోలేదు. కాల్ మని సెక్స్ రాకెట్లపై మహిళలు ఉద్యమిస్తే కనీసం  చర్య తీసుకోలేదు. వాటి గురించి మాట్లాడే దమ్ము మీకుందా అని ప్రశ్నించారు. విశాఖపట్నంలో ప్రతిపక్షనేతను హత్య చేయడానికి ప్రయత్నించిన మీరు శాంతిభధ్రతలగురించి మాట్లాడతారు.  
టీడీపీవి దొంగ నాటకాలు

జగన్ కులం,మతం,ప్రాంతం చూడం ప్రజలందరికి న్యాయం చేయాలని చెప్పారు. అదే చంద్రబాబు కలెక్టర్ల సమావేశంలో మా వాళ్లను మీరు చూసుకోండి అని అన్నారు.అది జగన్ గారికి చంద్రబాబుగారికి ఉన్నతేడా. –వాటిపై బయటకు తీసి చర్చ జరిపితే మీ టిడిపి బండారం బయటపడుతుంది. –మీకు నచ్చిన పది గ్రామాలు ఎంచుకోండి మేంసిధ్దం. మేం వస్తాం.టిడిపినేతలు జన్మభూమి కమిటీల అరాచకాలపై చర్చిద్దాం.మేం ఎక్కడికి రమ్మన్నా వస్తాం. తెలుగుదేశం బాధితుల శిబిరం నిర్వహించు. ఎవరూ ఏ రకమైన అరాచకాలు చేశారో ప్రజల వద్దే తేల్చుకుందాం.ఈ రెండు సవాళ్లు స్వీకరించు. బాధిత శిబిరాలు అంటూ చంద్రబాబు దొంగనాటకాలు ఆడుతున్నారని విమర్శించారు. మీకు దమ్ముంటే ఈ సవాల్ ను స్వీకరించండి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ లాఅండ్ ఆర్డర్ విషయంలో రాజీ పడదు.మా పార్టీ వాళ్లు తప్పు చేసినా ఊరుకోవద్దని చెబుతున్నాం. చంద్రబాబు హయాంలో టిడిపి నేతలు లక్షల కోట్లు దోచుకున్నారు. చంద్రబాబు,లోకేష్ ల దోపీడీలన్నీ కూడా ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి.
–ప్రతిపక్షంలో ఉండికూడా అరాచకాలు చేస్తున్న మీరు మా గురించి మాట్లాడతారా? మీలాగా మేం పోలీసులకు పచ్చచొక్కాలు తొడగలేదు.నిష్పాక్షికంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. గ్యాంగ్ స్టర్లు రేపిస్టులు,ఫ్యాక్షనిస్టులు అందరూ మీ టిడిపి లోనే ఉన్నారు.నెగిటివ్ పబ్లిసిటీ చేస్తూ రాష్ట్రానికి పరిశ్రమలు రాకుండా చేయడానికి కుట్రలు పన్నుతున్నారు. మీ బండారాలన్నీ కూడా త్వరలోనే బయటపెడతాం. చింతమనేని కూనరవి లాంటి వాళ్ళు ఇప్పటికీ చెలరేగిపోతున్నారు. తెలంగాణా,ఏపిలను పోల్చి చూస్తే వారికి మిషన్ భగీరధ,ప్రాణహిత చేవేళ్ళ వంటివి కనిపిస్తున్నాయి.ఇక్కడ చూస్తే లక్షల కోట్లు అప్పులు తెచ్చిన ఎటువంటి ఆస్దులు చూపలేకపోతున్నారు.  డైరక్ట్ గా పత్రికలలో రాయిస్తారు.పరిశ్రమలు వెళ్ళిపోతున్నాయి అని.పరిశ్రమల అధిపతులు బహిరంగంగా వచ్చి చెప్పాల్సి వస్తోంది మేం అలా అనలేదని అన్నారు. చంద్రబాబుకు బ్రాండ్ ఉంది వెన్నుపోటు,హత్యారాజకీయాలకు బ్రాండ్ అది. ప్రజలు నన్ను చిత్తుగా ఓడించారు.కాబట్టి ఈ రాష్ట్రాన్ని అభివృద్ది చెందనీయకూడదనే కక్షతో ఉన్నట్లు కనిపిస్తోంది. నీ నీచ రాజకీయాలకోసం వైయస్ వివేకానందరెడ్డి ని చంపించావు. గతంలో వంగవీటి రంగాను ఏవిధంగా చంపించావో హరిరామజోగయ్యగారు రాసిన పుస్తకంలో చెప్పారు. కిడ్నీరీసెర్చ్ సెంటర్ ఆస్పత్రిని నిర్మించాలని నిర్ణయించారు.ఎస్సి ఎస్టి బిసి మైనారిటీ,మహిళలకు 50 శాతం వర్క్స్ పదవులలో రిజర్వేషన్లు కల్పించారు. స్పందన కార్యక్రమానికి రూపకల్పన చేశారు.తిత్లీ తుఫాను బాధితులకు వారికి మీరు చేసిన అన్యాయం సరిదిద్ది నష్టపరిహారం ఇచ్చారు.రివర్స్ టెండరింగ్ చేశారు.ప్రాజెక్ట్ లలో వీలైనంత అదికంగా వాటర్ స్టోరేజ్ చేశారు.ఇలా చెప్పుకుంటూ వెళ్తే అనేకం చేశారని అయన అన్నారు.

No comments:
Write comments