నవంబర్ 1న రిలీజ్ కి సిద్దమైన ‘మీకు మాత్రమే చెప్తా

 

హీరో విజయ్ దేవరకొండ నిర్మాతగా కింగ్ ఆఫ్ ద హిల్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై తీసిన తొలి చిత్రం.. ‘మీకు మాత్రమే చెప్తా’ రిలీజ్ కు రెడీ అయింది.. తరుణ్ భాస్కర్, అభినవ్గో మటం,అనసూయ భరద్వాజ్, వాణి భోజన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ మూవీని షమ్మీర్ సుల్తాన్ డైరెక్ట్ చేసారు.ఫన్ ఎంటర్ టైనర్ గా రాబోతున్న ఈ మూవీని నవంబర్ 1న రిలీజ్కాబోతుంది.. ఈ సందర్భంగా నిర్మాత వర్థన్ దేవరకొండ మాట్లాడుతూ* : ఇప్పటి వరకు రిలీజ్ అయిన టీజర్, రెండు సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. 
నవంబర్  1న రిలీజ్ కి సిద్దమైన ‘మీకు మాత్రమే చెప్తా

కాలేజ్ మీట్స్ తో టీం బిజీ బిజీ గాఉంది.‘మీకు మాత్రమే చెప్పా’ కాన్సెప్ట్ ఎంత కనెక్ట్ అయ్యిందో కాలేజ్ మీట్స్ లో వచ్చిన రెస్సాన్స్ తో తెలుస్తుంది.మంచోడు అనే ఇమేజ్ ని కాపాడుకునేందుకు ప్రతి మనిషి ప్రయత్నిస్తుంటాడు. ఆ ఇమేజ్ ని డామేజ్ చేసే చిన్న తప్పును దిద్దుకునే ప్రయత్నంలో ఎంత కామెడీ పండిందనేది నవంబర్ 1న తెరమీద చూడబోతున్నారు. యూత్ కి కనెక్ట్ అయ్యేవిధంగా ఉన్న ఈ కాన్సెప్ట్ ని అందరూ యాక్పెప్ట్ చేస్తారనే నమ్మకం ఉంది.చిన్న పాయింట్ చుట్టూ అల్లుకున్న మంచి హిలేరియస్ ఎంటర్టైనర్ ఇది.ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నీచివరి దశలో ఉన్నాయి.అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని నవంబర్  1న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం. ‘‘మీకు మాత్రమే చెప్తా’’ లో తరుణ్ భాస్కర్, అభినవ్గోమటం, అనసూయ భరద్వాజ్, వాణి భోజన్ ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా.. పావని గంగిరెడ్డి, నవీన్ జార్జ్ థామస్, అవంతిక మిశ్రా, వినయ్ వర్మ,జీవన్ ఇతర ముఖ్య పాత్రల్లోనటిస్తున్నారు.

No comments:
Write comments