నాగార్జున సాగర్‌ 20 క్రస్ట్‌ గేట్లను ఎత్తివేసిన అధికారులు

 

నల్గొండ అక్టోబర్ 25 (globelmedianews.com):
నాగార్జున సాగర్‌కు వరద ఉధృతి బాగా పెరిగింది. 20 క్రస్ట్‌ గేట్లను అధికారులు ఎత్తివేశారు. సాగార్ ఇన్‌ఫ్లో 5.77 లక్షలు కాగా.. ఔట్‌ఫ్లో 6.05 లక్షల క్యూసెక్కులుగా ఉంది. శ్రీశైలం ప్రాజెక్టుకు కూడా వరద ప్రవాహం కొనసాగుతోంది. సాగర్.. 10 గేట్లను అధికారులు ఎత్తివేశారు. శ్రీశైలం ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 5.1 లక్షలు, ఔట్‌ఫ్లో 6.17 లక్షల క్యూసెక్కులు. 
నాగార్జున సాగర్‌ 20 క్రస్ట్‌ గేట్లను ఎత్తివేసిన అధికారులు

పూర్తిస్థాయి నీటినిల్వ 215 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 211.95 టీఎంసీలుగా ఉంది. జలవిద్యుత్‌ కేంద్రాల్లో విద్యుత్‌ ఉత్పత్తి కొనసాగుతోంది. జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుకుంది. 42 గేట్లను అధికారులు ఎత్తివేశారు. జూరాల ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 4.78 లక్షలు కాగా.. ఔట్‌ఫ్లో 4.35 లక్షల క్యూసెక్కులు. పూర్తి స్థాయి నీటి నిల్వ 9.657, ప్రస్తుతం 7.297 టీఎంసీలకు చేరుకుంది.

No comments:
Write comments