`రాగల 24 గంటల్లో` సినిమాకు యూ/ఏ సర్టిఫికేట్.. నవంబర్ 15న విడుదల..

 

సత్యదేవ్, ఈషా రెబ్బ, శ్రీరాం, గణేష్ వెంకట్రామన్, ముస్కాన్ సేథీ ముఖ్య పాత్రదారులుగా నటించిన చిత్రం `రాగల 24 గంటల్లో`. శ్రీ నవహాస్ క్రియేషన్స్, శ్రీ కార్తికేయ సెల్యూలాయిడ్స్ బానర్స్పై `ఢమరుకం` ఫేమ్ శ్రీనివాస్ రెడ్డి దర్శకత్వంలో శ్రీనివాస్ కానూరు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్ర సెన్సార్ పూర్తయింది. దీనికి యూ/ఏ సర్టిఫికేట్ ఇచ్చారు సెన్సార్ బోర్డ్. సస్పెన్స్ థ్రిల్లర్గా రూపొందిన ఈ చిత్రాన్ని నవంబర్ 15న విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా ..దర్శకుడు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ - ``సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రమిది. నవంబర్ 15న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం. 
`రాగల 24 గంటల్లో` సినిమాకు యూ/ఏ సర్టిఫికేట్.. నవంబర్ 15న విడుదల..

నన్ను నమ్మి ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ కష్టపడి పనిచేశారు. వారందరికీ నా కృతజ్ఞతలు. ముఖ్యంగా మా నిర్మాత శ్రీనివాస్ కానూరు మంచి అభిరుచిగల నిర్మాత. ప్యాషన్ తో ఈ సినిమాని కాంప్రమైజ్ కాకుండా నిర్మించారు. కెమెరా, మ్యూజిక్ ఈ సినిమాకి రెండు కళ్ళు. అంజి బ్యూటిఫుల్ విజువల్స్ ఇచ్చాడు. రఘు అద్భుతమైన పాటలు, రీ-రికార్డింగ్ చేశాడు. కృష్ణభగవాన్ స్క్రిప్ట్ నచ్చి మనసు పెట్టి మంచి డైలాగ్స్ రాశారు. సినిమా అన్ని వర్గాలను మెప్పించేలా ఉంటుంది`` అన్నారు.నిర్మాత శ్రీనివాస్ కానూరు మాట్లాడుతూ - `` సినిమాలపై ఉన్న ఆసక్తితో ఈ రంగంలోకి అడుగు పెట్టాను. నవంబర్ 15న `రాగల 24 గంటల్లో` వంటి మంచి సస్పెన్స్ థ్రిల్లర్ను తొలి చిత్రంగా ప్రేక్షకులకు అందించడం ఆనందంగా ఉంది. నటీనటులు, సాంకేతిక నిపుణులందరూ మంచి సహకారాన్ని అందించారు.  చిన్నపిల్లలు నుండి పెద్దవారి వరకు అందరికీ నచ్చే విధంగా ఈ చిత్రం ఉంటుంది``అన్నారు.
నటీనటులు: సత్యదేవ్, ఈషా రెబ్భ, శ్రీరామ్, గణేష్ వెంకట్రామన్, ముస్కాన్ సేథీ, కృష్ణభగవాన్, టెంపర్ వంశీ, అజయ్, అనురాగ్, రవి వర్మ, రవిప్రకాష్, మానిక్ రెడ్డి, అదిరే అభి తదితరులు.

No comments:
Write comments