పల్లె ప్రగతి కి 30 రోజుల ప్రణాళిక తోడ్పాటు

 

మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
ముధోల్, అక్టోబర్ 5 (globelmedianews.com)
రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన 30 రోజుల కార్యాచరణ ప్రణాళిక గ్రామ ప్రగతికి తోడ్పడుతుందని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి  ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. శనివారం30 రోజుల గ్రామ ప్రత్యేక ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ముధోల్ నియోజకవర్గంలోని వటోలి గ్రామంలో మంత్రి  ఇంద్రకరణ్ రెడ్డి పర్యటించారు. ముధోల్ ఎమ్మెల్యే విట్టల్ రెడ్డి తో కలిసివాడవాడలా పాదయాత్ర చేసి.. రోడ్లు, మురికి కాలువలు, హరితహారం కార్యక్రమంలో భాగంగా నాటిన మొక్కలను, పరిసరాలను పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన గ్రామ సభలోమంత్రి మాట్లాడుతూ.... తెలంగాణ గ్రామాలు దేశానికి ఆదర్శంగా నిలిచేలా ముఖ్యమంత్రి  కెసిఆర్ ప్రణాళికలను ప్రణాళికలను అమలు చేస్తున్నారని అన్నారు. 
పల్లె ప్రగతి కి 30 రోజుల ప్రణాళిక తోడ్పాటు

పల్లెల సమగ్ర అభివృద్ధికోసమే 30 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక కార్యక్రమంతో గ్రామాల్లో పచ్చదనం పరిశుభ్రత వెల్లివిరుస్తుందని తెలిపారు. గ్రామాలు ప్రగతిబాటలో కొనసాగాలంటే అభివృద్ధిలో ప్రజలంతాభాగస్వాములు కావాలని ప్రణాళికాబద్ధంగా గ్రామాల అభివృద్ధి జరగాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం భారీ పరిపాలన సంస్కరణల తీసుకొచ్చిందని వెల్లడించారు. భారత దేశంలో ఎక్కడాలేనివిధంగా తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి బాటలో పయనిస్తుందని చెప్పారు.  గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పేపర్ బ్యాగులను మంత్రి ఈ సందర్భంగాఆవిష్కరించారు. ప్లాస్టిక్ వస్తువుల నియంత్రణకు ప్రజలు పూర్తిగా సహకరించి, స్వచ్ఛందంగా వాటిని వినియోగించడం మానేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్ పల్సర్పల్సర్ విజయలక్ష్మి రెడ్డి , లోలం శ్యామ్ సుందర్, స్థానిక ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు

No comments:
Write comments