హూజూర్ నగర్ బరిలో 31 మంది

 

నల్గొండ, అక్టోబరు 2, (globelmedianews.com)
రాష్ట్రంలో ఆసక్తి రేపుతున్న హుజూర్ నగర్ ఉపఎన్నికలో నిలబడే అభ్యర్థుల సంఖ్య ఖరారైంది. నామినేషన్ల స్క్రూటినీ పూర్తికావడంతో… తుది జాబితాను ఎన్నికల అధికారులుప్రకటించారు. మొత్తం 31 మంది బరిలో నిలిచారని రిటర్నింగ్ అధికారి కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.హుజూర్ నగర్ ఉపఎన్నికకు సంబంధించి సెప్టెంబర్ 23 నుంచి సెప్టెంబర్ 30వరకు నామినేషన్లు తీసుకున్నారు. 
హూజూర్ నగర్ బరిలో 31 మంది

30వ తేదీన చివరిరోజు ఒక్కరోజే.. 67 మంది అభ్యర్థులు 106 నామినేషన్లు ఇచ్చారు. మొత్తం 76 మంది అభ్యర్థులు దాఖలుచేసిన 119నామినేషన్లను అధికారులు ఇవాళ పరిశీలించారు. వీటిలో.. 31 నామినేషన్లను అధికారులు ఆమోదించారు.45 మంది అభ్యర్థుల నామినేషన్లను అధికారులు రిజెక్ట్ చేశారు. డిపాజిట్చెల్లించకపోవడం, ఫారం 26సరిగా నింపకపోవడం, వేరే ఫామ్స్ తో నామినేషన్ వేయడం, ఫామ్ పై సంతకం చేయకపోవడం, పది మంది ప్రపోజర్స్ లేకపోవడం లాంటి కారణాలతోభారీసంఖ్యలో నామినేషన్లు తిరస్కరించినట్టు సూర్యాపేట జిల్లా ఎన్నికల అధికారులు ప్రకటించారు.

No comments:
Write comments