65కు చేరుకున్న‌ పాకిస్థాన్‌ రైలు ప్ర‌మాద మృతుల సంఖ్య

 

న్యూ ఢిల్లీ అక్టోబర్ 31 (globelmedianews.com):
పాకిస్థాన్‌లోని తేజ్‌గ‌మ్ రైలు ప్ర‌మాద ఘ‌ట‌న‌లో మృతుల సంఖ్య 65కు చేరుకున్న‌ది. ఈ ప్ర‌మాదంలో అనేక మంది గాయ‌ప‌డ్డారు. ఓ బోగీలో ఉన్న సిలిండ‌ర్ పేల‌డంతో.. మూడు బోగీలు దాదాపు బూడిద‌య్యాయి. గాయ‌ప‌డ్డ‌వారిని లియాక‌త్‌పూర్ హాస్ప‌ట‌ల్‌కు తీసుకువెళ్లారు. క‌రాచీ నుంచి రావాల్పిండి వెళ్తున్న రైలులో అగ్ని ప్ర‌మాదం జ‌రిగింది. ప్ర‌యాణికులు ఉద‌యం అల్పాహారం త‌యారు చేస్తుండ‌గా ప్ర‌మాదం జ‌రిగిన‌ట్లు తెలుస్తోంది. త‌బ్‌లేగీ జ‌మాత్ సంఘానికి చెందిన వ్య‌క్తులు అగ్ని ప్ర‌మాద ఘ‌ట‌న‌లో చ‌నిపోయిన‌ట్లు రైల్వే మంత్రి షేక్ ర‌షీద్ తెలిపారు. ప్ర‌మాద స‌మ‌యంలో చాలా మంది ప్ర‌యాణికులు రైలు నుంచి బ‌య‌ట‌కు దూకారు. 
65కు చేరుకున్న‌ పాకిస్థాన్‌ రైలు ప్ర‌మాద మృతుల సంఖ్య  

అయితే ప్ర‌యాణికులు రైలు ఎక్కుతున్న స‌మ‌యంలో గ్యాస్ సిలిండ‌ర్‌ను దాచి ఉంటార‌ని రైల్వే అధికారులు వెల్ల‌డిస్తున్నారు. దుస్తుల్లో సిలిండ‌ర్‌ను దాచ‌డం వ‌ల్ల అది త‌మ‌కు తెలియ‌లేదన్నారు. పాకిస్థాన్‌కు చెందిన 1122 రెస్క్యూ బృందాలు మంట‌ల్ని ఆర్పేశాయి. ఆర్మీ ద‌ళాలు, డాక్ట‌ర్లు, పారామెడిక్స్ హుటాహుటిన అక్క‌డ‌కు చేరుకున్నారు. ముల్తాన్ నుంచి ఆర్మీ హెలికాప్ట‌ర్ సంఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్న‌ది. మృతుల కుటుంబాల‌కు ప్ర‌ధాని ఇమ్రాన్ ఖాన్ సంతాపం తెలిపారు. గాయ‌ప‌డ్డ‌వారికి వైద్యం అందించాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. ఈ ఘ‌ట‌న ప‌ట్ల రైల్వే శాఖ విచార‌ణ‌కు ఆదేశించింది. రెండు గ్యాస్ సిలిండ‌ర్లు పేలాయ‌ని, దానికి తోడు వారి ద‌గ్గ‌ర వంట నూనె ఉండ‌డంతో ప్ర‌మాద తీవ్ర‌త ఎక్కువ‌గా ఉంద‌ని రైల్వే మంత్రి అభిప్రాయ‌ప‌డ్డారు.

No comments:
Write comments