తెలంగాణలో వరికి మరింత పెరిగిన మద్దతు

 

నిజామాబాద్, అక్టోబరు 1, (globelmedianews.com)
రాష్ట్ర ప్రభుత్వం పౌరసరఫరా శాఖ ద్వారా రైతుల నుంచి ఈ ఖరీఫ్ సీజన్‌లో నేరుగా ధాన్యం కొనుగోళ్లు చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది. నవంబర్ మొదటి వారంలో కొనుగోళ్లు ప్రారంభిస్తారు. అయితే, ఈ ఏడాది వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా నాట్లు ఆలస్యంగా వేయడంతో కోతలు కూడా ఆలస్యమయ్యే అవకాశం ఉంది. తెలంగాణ ప్రభుత్వం రైతులకు మద్దతు ధరను పెంచింది. కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం అమ్ముకునే రైతులకు గ్రేడ్ ఏ రకానికి గత ఏడాది రూ.1870 ఇవ్వగా ఈ ఏడాది దానిని రూ 1935 కి పెంచారు. కామన్ రకానికి గత ఏడాది రూ. 1850 ఉండగా ఈ ఏడాది నుంచి దానిని రూ.1915 లకు పెంచారు.రైతులకు మద్దతు ధర కచ్చితంగా అందేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం జిల్లా అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. మొదటి వారం కొనుగోళ్లు ప్రారంభించాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. 
తెలంగాణలో వరికి మరింత పెరిగిన మద్దతు

ఆ తర్వాత ధాన్యం వచ్చిన దానిని బట్టి కేంద్రాలను ప్రారంభిస్తారు. దీనికి సంబంధించి అధికారులు సమీక్షా సమావేశాలు నిర్వహించి ఎలాంటి చర్యలు తీసుకోవాలని అనే దానిజిల్లాలో వివిధ ప్రాంతాలలో ప్రతి ఏడాది మాదిరిగానే వరి పంట ముందుగానే కోతకు వచ్చే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకొని నవంబర్ మొదటి వారం లో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించేందుకు పౌరసరఫరాల శాఖ అధికారులు సిద్ధమవుతున్నారు. జిల్లాలో ఈ ఖరీఫ్‌లో 90 కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యాన్ని సేకరించాలని అధికారులు నిర్ణయించారు. లక్ష 70 వేల మె ట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించే లక్ష్యంగా ప్రణాళికను రూపొందించారు. గ్రేడ్-ఏ రకానికి ఈ ఏడాది రూ. 1935 లు, సాధారణ రకానికి రూ 1915 చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు వివిధ శాఖల ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. వాటికి అవసరమైన గన్నీ సంచులను సిద్ధంగా ఉంచారు. ఐకేపీ గ్రూప్‌ల ద్వారా 15 కొనుగోలు కేంద్రా లు, ప్రాథమిక సహకార సంఘాల ఆధ్వర్యంలో 75 కొ నుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. జిల్లాలో ఈ ఖరీఫ్‌లో 2,13,019 మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఈఖరీఫ్‌లో రైతులు సన్న రకాలు పండిస్తారు. కాబట్టి నేరుగా వినియోగదారులకే అమ్ముకుంటారు. అందుకే తక్కువ ధాన్యం వస్తుందని అధికారుల అంచనా. ప్రజాపంపిణీ అవసరాల దృష్ట్యా పెద్ద మొత్తంలో ధాన్యం కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో పలు సూచనలు చేసింది. గ్రామాల్లో రైతులను చైతన్యవంతం చేసేందుకు మద్దతు ధర కొనుగోలుకు నిర్ధేశించిన ప్రమాణాలను కరపత్రాల ప్రచారం చేసేందుకు రంగం సిద్ధం చేశారు. మరోవైపు గ్రామాల్లో ప్రైవేటు వ్యక్తులు కాంటాలు పెట్టి ప్రజలను మోసం చేయకుండా చూడాలని పలువురు కోరుతున్నారు. రైతులకు ఎలాం టి ఇబ్బందులు కలుగవద్దని, ధాన్యం కొనుగోలు చేసిన రైతులకు నేరుగా బ్యాంకు ఖాతాలో నగదు పడేలా అధికారులు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర స్థాయి అధికారులు పేర్కొన్నారు. ఐకేపీ ద్వారా కొనుగోలు చేస్తున్న ధాన్యానికి సంబంధించి మహిళలకు అందించి కమీషన్‌ను సకాలంలో వారి ఖాతాలోకి అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. గిరిజన ప్రాంతాల్లోని ప్రజలను ప్రైవేటు వ్యాపారులు మోసం చేసే అవకాశం ఉన్నందున పౌరసరఫరాల శాఖ అధికారులు రైతాంగాన్ని చైతన్యం చేసే దిశగా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.కొనుగోలు చేసిన ధాన్యానికి వీలైనంత త్వరగా డబ్బులు చెల్లించేలా ఏర్పాట్లు చేశారు. ఆన్‌లైన్ చెల్లింపులకు సంబంధించి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా చెల్లించే అవకాశం ఉంది. దీనికి సంబంధించి అనుమతుల కోసం అధికారులు ఫైల్ పంపించారు.కొనుగోలు కేంద్రాలలో ధాన్యాన్ని విక్రయించే రైతుల వివరాలను ఆన్‌లైన్‌లో పొందుపర్చనున్నారు.కొనుగోలు కేంద్రంలో రైతులు ధాన్యాన్ని విక్రయించగానే ఆ రైతు వివరాలతో పాటు మిల్లుకు రవాణా చేసే కాంట్రాక్టరు వివరాలను ఆన్‌లైన్‌లో పొందుపరుస్తారు.అదేవిధంగా ఈ ఏడాది నుంచి టోకెన్ల విధానాన్ని ప్రవేశపెడుతున్నారు.రైతులు కొనుగోలు కేంద్రాల వద్ద వేచి ఉండకుండా టోకెన్ల పద్ధతిన ధాన్యాన్ని కొనుగోలు చేయనున్నారు.రైతులు ముందస్తుగా కొనుగోలు కేంద్రానికి వెల్లి తన ధాన్యాన్ని శాంపిల్ అందించాల్సి ఉంటుంది.దానిని పరిశీలించిన అధికారులు కొనుగోలు కేంద్రానికి ధా న్యాన్ని ఎప్పుడు తీసుకరావాలో రైతుకు సమాచారం అందిస్తారు. వారు చెప్పిన రోజున మాత్రమే రైతు తమ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకవెళ్ల్లాల్సి ఉం టుంది.దీని ద్వారా రైతులకు ఇబ్బందులు ఉండవు.

No comments:
Write comments