అరాచకాలకు పాల్పడితే అడ్డుకట్ట వేస్తాం: పయ్యావుల

 

అనంతపురం అక్టోబర్ 1 (globelmedianews.com)
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మంగళవారం ఉరవకొండలో టీడీపీ పార్టీకార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ అరాచకాలకు పాల్పడితే అడ్డుకట్ట వేస్తామని హెచ్చరించారు. ఎదుటి మనిషిపై బురద చల్ల కుండ మానుకోవాలన్నారు. 
 అరాచకాలకు పాల్పడితే అడ్డుకట్ట వేస్తాం: పయ్యావుల

ముఖ్యమంత్రిజగన్ ద్వారా నిధులను తెప్పించుకొని నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చూపించాలన్నారు. ప్రజలను రెచ్చగొట్టే విధంగా రాజకీయాలు చేయడం మానుకోవాలని పయ్యావుల కేశవ్సూచించారు. కాగా నిన్న ఉరవకొండ నియోజకవర్గం కౌకుంట్ల పంచాయతీ విభజన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసిన విషయం తెలిసిందే.

No comments:
Write comments