కాలేజీల్లో కాంట్రాక్టు లెక్చరర్లే దిక్కా

 

వరంగల్, అక్టోబరు 2, (globelmedianews.com)
రాష్ట్రంలోని ప్రభుత్వ కళాశాల్లో విద్యార్ధ్దుల బోధనకు కాంట్రాక్టు అధ్యాపకులే దిక్కుగా మారారు. దాదాపు ఐదేండ్లుగా నియమాకాలు లేకపోవడం వల్ల ఈ పరిస్థితి నెలకొంది. బోధనాసిబ్బంది కొరత కారణంగా విద్యార్థులు ్రైపైవేటు కళాశాలల దారి పడుతున్నారు. కాంట్రాక్టు ఉద్యోగులకు సకాలంలో వేతనాలు అందకపోవడంతో వారు కూడ అరకొరగా పాఠాలుబోధిస్తున్నారు. కళాశాల అధ్యాపక పోస్టులు భర్తీ చేస్తారని లక్షలాదిమంది నిరుద్యోగులు ఎదురుచూస్తున్నారు. 2008 ఎన్నికల్లో జూనియర్ కళాశాల అధ్యాపకుల పోస్టులు భర్తీచేశారు. 2012లో డిగ్రీ కళాశాలల ఖాళీలు పోస్టుల నియమాకాలు చేశారు.అప్పటి నుంచి నేటివరకు ఖాళీ పోస్టుల భర్తీ ఊసేలేదు. జూనియర్ కళాశాల్లో 4451 పోస్టులు  ఖాళీలుండగా, వాటిని భర్తీ చేయకుండా  3500మంది ఒప్పంద ఉద్యోగులతో కాలం వెల్లదీస్తున్నారు. 
కాలేజీల్లో కాంట్రాక్టు లెక్చరర్లే దిక్కా

అదే విధంగా డిగ్రీ కళాశాల్లో  1342 ఖాళీలుండగా వాటిని 841మందికాంట్రాక్టు అధ్యాపకులతో అరకొరగా పాఠాలు సాగిస్తున్నారు. లైబ్రరీ, గ్రంథాలయాలకు సంబంధించిన సిబ్బంది కూడా అంతంత మాత్రమే. విద్యార్ధ్దులు ఏంచేయాలో అర్దంకాకతలపట్టుకుంటున్నారు. విద్యా సంవత్సరం ప్రారంభంలో ఇంటర్, డిగ్రీ కళాశాల్లో విద్యార్ధులు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేస్తామని, ఉచితంగానోట్‌పుస్తకాలు కూడా ఇస్తామని విద్యాశాఖ మంత్రి ఊదరగొట్టారు. కానీ విద్యాసం వత్సరం ప్రారంభమై నాలుగు నెలలు గడుస్తున్నా వాటిని గురించి పట్టించుకునే నాథుడే కరవైయ్యాడనివిద్యార్ధులు వాపోతున్నారు. భవిష్యత్తులో  కేజి టూ పిజి ఉచిత విద్య అమలు కాగితాలకే పరిమితమైతుందని విద్యార్ధులు మండిపడుతున్నారు.ప్రైవేటు యాజమాన్యాలకు సర్కార్దాసోహంగా మారి ప్రభుత్వం కళాశాలలు నామ మాత్రంగా ఉండేలా కుట్రలు పన్నుతూ సిబ్బంది నియమాకాలు లేకుండా మోకాలడ్డు వేస్తూ తమ విద్య వ్యాపారాన్ని పెంచుకునే ప్లాన్చేస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. 8 యూనివర్శిటీల పరిధిలో కూడా  1068 ఖాళీ పోస్టులు న్నాయి. మహ్మాతాగాంధీలో 36, పాలమూరు యూనివర్శిటీలో 68,  శాతవాహాన64, బాసర (ఆర్‌బియుకెటి) 101, కాకతీయ 142,   ఉస్మాని యా యూనివర్శిటీలో అత్యధికంగా  430,  జెన్‌ఎఫ్‌ఏ యూలో  21, జెన్‌టియూహెచ్‌లో  190 పోస్టులు  ఖాళీలు ఉన్నాయని యూనివర్శిటీ అధికారులు  వెల్లడించారు. ఈఏడాదిలో విద్యార్దులు ఎక్కువ సంఖ్యలో చేరారని, దీంతో ప్రభుత్వం నూతన నియమాకాలు  చేపడుతారని ఆశిస్తేముందస్తు ఎన్నికల నేపథ్యంలో మరికొంతకాలం వాయిదా వేయవచ్చని వ్యాఖ్యానిస్తున్నారు.

No comments:
Write comments