ఎర్ర స్మగ్లర్లు ఆరెస్టు

 

చిత్తూరు అక్టోబరు 16, (globelmedianews.com)
చిత్తూరు జిల్లా తిమ్మినాయుడు పాలెం సమీపంలో ఎర్ర చందనం దుంగలను రవాణా చేస్తున్న ఇద్దరు పాత నేరస్థులైన స్థానిక స్మగ్లర్లు ను టాస్క్ ఫోర్స్ పోలీసు లు అరెస్టు చేశారు. టాస్క్ ఫోర్స్ ఇంచార్జ్ రవిశంకర్ ఆదేశాల మేరకు డీఎస్పీ వెంకటయ్య సూచనల తో రంగంలోకి దిగిన అధికారుల బృందం తిమ్మినా యుడు పాలెం అటవీ ప్రాంతం నుంచి కూంబింగ్ ప్రారంభించింది. స్మగ్లర్లు తరుచు ఉపయోగించే మార్గాలలో తనిఖీలు చేస్తుండగా భూపాల్ కాలనీ వెనుక వైపు ఉన్న అటవీ ప్రాంతంలో స్మగ్లర్లు అలికిడి వినిపించింది. 
ఎర్ర స్మగ్లర్లు ఆరెస్టు

కొంతమంది స్మగ్లర్లు ఎర్ర చందనం దుంగలతో వస్తుండగా వారిని పట్టుకునేందుకు ప్రయత్నించారు. వాళ్లు టాస్క్ ఫోర్స్ సిబ్బంది పై రాళ్లతో దాడికి దిగారు. అయితే టాస్క్ ఫోర్స్ సిబ్బంది చాకచక్యంగా వ్యవహరించి ఇద్దరిని పట్టుకున్నారు. వారితో పాటు నాలుగు దుంగలను స్వాధీనం చేసుకున్నారు. వారిని తిమ్మినాయుడు పాలెం కు చెందిన రమణయ్య, పూతలపట్టు కు చెందిన శ్రీరాములు గా గుర్తించారు. వీరిని విచారించగా గతంలో కూడా పలుసార్లు స్మగ్లింగ్ కు పాల్పడినట్లు అంగీకరించారు. వీరు అందజేసిన సమాచారం మేరకు మరికొంత మంది స్మగ్లర్లు కోసం గాలిస్తున్నా రు. వీరిపై కేసు నమోదు చేసిన టాస్క్ ఫోర్స్ పోలీసు స్టేషన్ హెచ్ సి నాగేంద్ర దర్యాప్తు చేస్తున్నారు.

No comments:
Write comments