ఏపీలో బీజేపీ

 

వై సీపీ వైపా,  టీడీపీ వైపా
విజయవాడ, అక్టోబరు 24 (globelmedianews.com)
అపర చాణక్యుడు అని ఊరికే బిరుదులు ఇచ్చేయరు. ఇక దేశానికి హోం మంత్రి కావడం అంటే అది కూడా అదాటున జరిగిపోయేది కానే కాదు. ఎంతో విషయం ఉంటే తప్ప అంతటి స్థాయికి చేరుకోలేరు. ఇది ఎవరి విషయమైనా కూడా నిజం. అమిత్ షా గుజరాత్ నుంచి ఏకంగా దేశంలో అతి పెద్ద పార్టీకి జాతీయ అధ్యక్షుడిగా బలమైన నాయకత్వాన్ని అందిస్తున్నారంటే అది ఆయన గొప్పతనమే. రాజకీయ చాణక్యంలో కూడా షాకు ఎవరూ తీసిపోరు అన్నది 2014, 2019 ఎన్నికలను పరిశీలిస్తే అర్ధమైపోతుంది. మోడీ గ్లామర్ ని మొత్తం ఒడిసిపట్టి ఈవీఎం లో ఓట్లు నింపుకునేలా చేసే నైపుణ్యం మాత్రం అమిత్ షాదే. అటువంటి అమిత్ షా ఏపీ మీద గట్టిగా దృష్టి పెడితే పడిపోదా అనే వారూ ఉన్నారు. 
ఏపీలో బీజేపీ

ఇప్పటికైతే ఆయన చూపు మాత్రమే సారించారు. ఇదిలా ఉండగా ఏపీలో ఉన్న ఇద్దరు బలమైన ప్రాంతీయ పార్టీల అధిపతులు చంద్రబాబు, జగన్ లతో అమిత్ షా ఎలా మెలుగుతారు అన్నది తొందరలోనే తేలనుంది. దానికి సూచనాప్రాయ‌మైన సంఘటన ఒకటి జరిగింది.అమిత్ షాతో జగన్ అపాయింట్ మెంట్ ఒక్కసారి కుదరలేదు. ప్రధాని మోడీని ఎపుడు పడితే అపుడు కలుసుకునే జగన్ కి అమిత్ షా దర్శనం మాత్రం అవడం కొంత కష్టమే అయింది. ముమ్మారు రద్దు అయిన అప్పాయింట్మెంట్ చివరికి కుదరడమే కాదు సానుకూల వాతావరణంలో భేటీ జరిగిందని వైసెపీ వర్గాల సమాచారం. ఈ సందర్భంగా పోలవరం రివర్స్ టెండరింగ్ విషయంలో అమిత్ షా జగన్ భుజం తట్టారని, అలా ముందుకు సాగిపోమ్మన్నారని కూడా కధనాలు వస్తున్నాయి. వందల కోట్ల రూపాయల ఆదాయం సమకూర్చినందుకు అభినందనలు కూడా చెప్పారని ప్రచారం సాగుతోంది. ఇక ఏపీపై ప్రత్యేక శ్రధ్ధ తాను తీసుకుంటానని, మంత్రులు అందరితో మాట్లాడి చేయాల్సిన సాయాన్ని చేస్తానని అమిత్ షా చెప్పడంతో జగన్ ముఖంలో ఆనందం కనిపించిందని వైసీపీ నేతలు చెప్పుకొచ్చారు. మొత్తానికి అమిత్ షా ఏపీ అభివుద్ధి విష‌యంలో రాజకీయాలు తావు లేదని చెప్పారని అంటున్నారు.ఇల జగన్ అమిత్ షా తో భేటీ ఉత్సాహం ఉండగానే మరో వైపు చంద్రబాబుకు రీట్వీట్ చేసి అమిత్ షా తనదైన మంత్రాంగం బయటకు తీశారా అన్న అనుమానాలు కలిగించేశారు. అమిత్ షా పుట్టిన రోజు సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు ట్వీట్ చేస్తే ధన్యవాదాలతో అమిత్ షా రీట్వీట్ చేసి తెలుగుదేశానికి ఆనందం పంచారు. ఎవరైనా అభినందిస్తే ధన్యవాదాలు చెప్పడం సహజం కదా ఇందులో వింతేముందని అనుకోవడానికి లేదు. అమిత్ షా ఇంతకు ముందు ఎన్నో పుట్టిన రోజులు జరుపుకున్నారు. మరి నాడు చంద్రబాబు ఇలా ట్వీట్ చేశారో లేదో తెలియదు కానీ ఈసారి మాత్రం కాస్త రాజకీయ రంగు మిళాయించి మరీ ట్వీట్ చేశారనే అంటున్నారు. ఈ మధ్యనే బీజేపీతో సంబంధాలు మెరుగుపరచుకోవాలని చంద్రబాబు ప్రయత్నించారని అంటున్నారు. దానికి నాందిగా అమిత్ షా బర్త్ డే ని ఉపయోగించుకునారని అంటున్నారు. అమిత్ షా ప్రతిస్పందనే ఇపుడు ఏపీలో హాట్ టాపిక్. ఓ చేత్తో జగన్ భుజం తట్టిన అమిత్ షా మరో చేత్తో బాబుకు కూడా కన్ను గీటుతున్నారా అన్న అనుమానాలు కూడా రేకెత్తించేశారు. నవంబర్లో ఏపీ టూర్లో సైతం అమిత్ షా ఇదే రకమైన సందిగ్ద రాజకీయమే నడుపుతారని, ఇద్దరు నేతలను కనుసన్నల్లో ఉంచుకుని ఎవరి అవసరం ఉంటే చివరికి వారితోనే ముందుకు వెళ్తారన్న విశ్లేషణలు కూడా వస్తున్నాయి. చూడాలి మరి.

No comments:
Write comments