గోదావరిలో భారీ వర్షం…బోటు పనులకు అంతరాయం

 

రాజమండ్రి అక్టోబరు 22, (globelmedianews.com)
దేవీపట్నం మండలం కచ్చులూరు మందం వద్ద గోదావరిలో మునిగిపోయిన రాయల్ వశిష్ట పున్నమి బోటు వెలికితీత ప్రాంతంలో  భారీ వర్షం పడుతోంది. మంగళవారం విశాఖకు చెందిన డ్రైవర్స్ బోటును బయటకు తీసేందుకు ఐరన్ రోప్ ను జేసీబీ ద్వారా లాగి ఒడ్డుకు చేర్చే ప్రయత్నం చేస్తున్నారు. 
గోదావరిలో భారీ వర్షం…బోటు పనులకు అంతరాయం

కాని వర్షం వారి పనులకు అంతరాయం కలిగిస్తోంది. దీంతో పనులు కొంత సేపు ఆగిపోయాయి. సోమవారం చేపట్టిన పనుల్లో కొంత పురోగతి కనిపించింది. బోటు ముందు భాగంలో ఉండే ప్లాట్ఫామ్, బోటు క్యాబిన్లోని కొంత భాగం, హైడ్రాలిక్ గేర్రాడ్, రెయిలింగ్లోని కొంత భాగం, బోటు టాప్పై ఉండే ప్లాస్టిక్ షీట్, బోటు నేమ్ బోర్డును బయటకు తీశారు. లంగర్లకు చిక్కినట్టే చిక్కి.. పట్టు జారడంతో బోటు మొత్తాన్ని బయటకు తీయడం వీలు కాలేదు.

No comments:
Write comments