ఆర్టీసీ కార్మికులకు బీజేపీ అండ

 

సూర్యాపేట అక్టోబరు 15, (globelmedianews.com)
ఆర్టీసీ కార్మికుల సమ్మెకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, మాజీ ఎంపీ వివేక్, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని  వెంకటేశ్వర రావు లు సంఘీభావం ప్రకటించారు. మంగళవారం సూర్యాపేట ఆర్టీసీ కార్మికులను వారు పరామర్శించారు.   లక్ష్మణ్ మాట్లాడుతూ  ఆర్టీసీ ఉద్యోగులను సెల్ఫ్ డిస్మిస్ చేయడం కాదు. ప్రజలే కెసిఆర్ ప్రభుత్వాన్ని డిస్మిస్ చేస్తారు. హుజుర్ నగర్ ఎన్నికల కోసమే కేకే చర్చల డ్రామా.
ఆర్టీసీ కార్మికులకు బీజేపీ అండ

రాష్ట్ర చరిత్రలు ఇన్ని రోజులు దసరా సెలవులు ఇచ్చిన ప్రభుత్వమే లేదని అన్నారు. తెరాస మెడలు వంచే శక్తి బీజేపీ కి మాత్రమే ఉన్నది. కార్మికుల జీతాలు ఆపిన కెసిఆర్, ఎమ్మెల్యేలు ఎంపీ ల జీతాలు అపాడా అని ప్రశ్నించారు. ఆర్టీసీ కార్మికులతో పెట్టుకుని కెసిఆర్ అగ్గితో గోక్కుంటున్నాడు. సమ్మె ను బూచిగా చూపి, ఆర్టీసీని ప్రైవేట్ పరం చేయడానికి కెసిఆర్ కుట్ర అని ఆరోపించారు. తెలంగాణ ఉద్యమంలో ఏనాడూ పాల్గొనని మంత్రులు సమ్మె గురుంచి మాట్లాడడం సిగ్గుచేటు. కెసిఆర్ మొండివైఖరి విడనాడి..కార్మికుల సమస్యలు పరిష్కరించాలని అన్నారు. కార్మికుల సమస్యలు పరిష్కారమయ్యేంత వరకు బీజేపీ అండగా ఉంటదని అయన అన్నారు.

No comments:
Write comments