పోలీసులను బ్లాక్ మెయిల్ చేస్తున్న చంద్రబాబు

 

గుంటూరు అక్టోబరు 16, (globelmedianews.com)
ఏపిలోని 13 జిల్లాల్లో బిజేపి గాంధీ సంకల్ప యాత్రలు  జరుపుతున్నాం. ఈ నెల 31 వరకు పాదయాత్ర లు కొనసాగుతాయి. ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది. జాతీయ నేతలు , కేంద్ర మంత్రులు ఈ యాత్ర లలో పాల్గోంటారు. ఈ యాత్రల ద్వారా ఏపి లో బిజేపి బలపడుతుందని బీజేపీ నేత విష్ణు వర్ధన్ రెడ్డి అన్నారు. బుధవారం అయన మీడియాతో మాట్లాడారు. 
పోలీసులను బ్లాక్ మెయిల్ చేస్తున్న చంద్రబాబు

ఏపిలో జర్నలిస్ట్ హత్య ను తీవ్రంగా ఖండిస్తున్నారు.  వరస వెంట జర్నలిస్టు పై జరుగుతున్న దాడులపై విచారణ చేపట్టాలి. శాంతిభద్రతల వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం కఠినంగా ఉంటుంది. మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు  నేరుగా పోలీస్ అధికారులు బ్లాక్ మెయిల్ చేయడం సిగ్గుచేటని అన్నారు. చంద్రబాబు,  తెలుగుదేశం నేతలు అధికారులను బెదిరించాడాన్ని బిజెపి తీవ్రంగా ఖండిస్తోందని అన్నారు.  చంద్రబాబు మీద రాష్ట్ర ప్రభుత్వం సుమోటో కేసు నమోదు చేయాలని అయన డిమాండ్ చేసారు.

No comments:
Write comments