వేటగాళ్లు అమర్చిన విద్యుత్ తీగలు తగిలి వ్యక్తి మృతి

 

గుప్త నిధుల కోసం వెళ్లిన నేపథ్యంలో జరిగిన సంఘటన
భద్రాద్రి కొత్తగూడెం  అక్టోబర్ 31, (globelmedianews.com)
గుప్త నిధుల తవ్వకాల కోసం తన స్నేహితులతో కలిసి వెళ్లి అడవి జంతువుల వేట కోసం వేటగాళ్లు అమర్చిన విద్యుత్ తీగలు తగిలి వ్యక్తి మృతి చెందిన సంఘటన అన్నపురెడ్డి పల్లి మండలం బూరుగు  గూడెం గ్రామంలో చోటు చేసుకుందిఇందుకు సంబంధించి పోలీసులు గ్రామస్థులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.  బూరుగూడెం గ్రామానికి చెందిన పఠాన్ హజ్మాద్ ఖాన్ తన స్నేహితులైన అబ్బుగూడెం గ్రామానికి చెందిన రమేష్ సుధాకర్ లతో కలిసి ఈనెల 29వ తేదీన రాత్రి బూరుగు గూడెం అటవీ ప్రాంతంలోని గుట్టల్లో గుప్తనిధుల తవ్వకాల కోసం వెళ్లాడు. అదే అటవీ ప్రాంతంలో అడవి జంతువులను వేటాడేందుకు వేటగాళ్లు విద్యుత్ తీగలు అమర్చారు ఈ విషయం తెలియని హజ్మాద్ ఖాన్ అతని స్నేహితులు అటుగా వెళ్లారు 
వేటగాళ్లు అమర్చిన విద్యుత్ తీగలు తగిలి వ్యక్తి మృతి

దీంతో హజ్మాద్ ఖాన్ కు వేటగాళ్లు అమర్చిన విద్యుత్ తీగలు తగిలి విద్యుత్ ఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెందాడు ఇది చూసిన అతని స్నేహితులు రమేష్ సుధాకర్ భయంతో అక్కడి నుండి పారిపోయారు మరుసటి రోజు గ్రామస్తులకు పోలీసులకు సమాచారం ఇచ్చారు గ్రామస్తులు పోలీసులు బూరుగుగూడెం అటవీ ప్రాంతంలో బుధవారం  గాలింపు చర్యలు చేపట్టారు అయితే మృతదేహం లభించలేదు. గురువారం  పొలాలకు  వెళ్లిన గ్రామస్తులకు అటవీ ప్రాంతంలోని గుట్ట పక్కన మృతదేహం కనిపించింది.  గ్రామస్తులు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో జూలూరుపాడు సర్కిల్ సిఐ నాగరాజు సిబ్బందితో కలిసి అటవీ ప్రాంతంలో మృతదేహం ఉన్న ప్రదేశానికి చేరుకొని మృతదేహాన్ని పోలీసులు గ్రామస్తులు సహాయంతో చండ్రుగొండ పోలీస్ స్టేషన్ కు తరలించారు. అనంతరంపోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కొత్తగూడెం ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ నాగరాజు తెలిపారు

No comments:
Write comments