నెలరోజుల క్రితం ప్రేమ పెళ్లి.. భార్య కోసం టవరెక్కిన భర్త

 

ఒంగోలు అక్టోబరు 29 (globelmedianews.com)
వాళ్లిద్దరూ ప్రేమించుకున్నారు.. నెలరోజుల క్రితం ఏడడుగల బంధంతో ఒక్కటయ్యారు. అయితే ఏం జరిగిందో ఏమోగానీ యువతి తల్లిదండ్రులు ఇంటికి తీసుకెళ్లి తిరిగి భర్త వద్దకు పంపలేదు. దీంతో భర్త సెల్ టవర్ ఎక్కాడు. ఈ ఘటన ప్రకాశం జిల్లా పర్చూరు మండలం అన్నంబొట్లవారిపాలెంలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే...గుంటూరుకు చెందిన యువకుడు, పర్చూరుకు చెందిన యువతిని ప్రేమించి పెళ్లిచేసుకున్నాడు. 
నెలరోజుల క్రితం ప్రేమ పెళ్లి.. భార్య కోసం టవరెక్కిన భర్త

నెల రోజుల క్రితం ఈ పెళ్లి జరిగింది. అయితే విషయం తెలుసుకున్న యువతి తల్లిదండ్రులు వారం రోజుల కిందట గుంటూరుకు వచ్చి మళ్లీ వారం తర్వాత పంపుతామని పెద్ద మనుషుల సమక్షంలో ఇంటికి తీసుకెళ్లారు. అయితే ఆమెను తిరిగి పంపకపోవడంతో భర్త సెల్ టవర్  ఎక్కాడు. యువతిని తనతో కాపురానికి పంపితేనే టవర్ దిగుతానని లేకుంటే ఇక్కడ్నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటానని హల్ చల్ చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఆ యువకుడితో మాట్లాడి కిందికి దింపారు.

No comments:
Write comments