కొల్లామ్ కు రైళ్లు నడపండి

 

విశాఖపట్నం అక్టోబరు 24 (globelmedianews.com)
శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తుల సౌకర్యార్ధం విశాఖ నుంచి నేరుగా కొల్లామ్ కు వచ్చేనెల 15 నుంచి జనవరి 20 తేదీల మధ్య ప్రత్యేక రైళ్లు నడపాలని ఈ కో రైల్వే జీఎం విద్యా భూషణ్  కు  విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ  లేఖ రాశారు . ప్రతీ ఏటా శబరిమలకు పెరుగుతున్న రద్దీ దృష్ట్యా తగు రైళ్లను నడపాలని ఈ సందర్భంగా  కోరారు. 
కొల్లామ్ కు రైళ్లు నడపండి

పూరి జగన్నాధ రధయాత్ర సమయంలో ,నడిపిన ప్రత్యేక రైళ్ల తరహాలో అయ్యప్ప భక్తులకు వెసులుబాటు కల్పించాలని కోరారు. మండల దీక్షలు పూర్తిచేసుకున్న అలాగే మకరజ్యోతి దర్శనం కి వెళ్లే భక్తులకు ప్రత్యేక రైళ్ల  అవసరం ఎంతైనా ఉందని  కోరుతూ , తగు నిర్ణయం అనుకూలంగా తీసుకోవాలని లేఖ లో ఎంపీ కోరారు.

No comments:
Write comments