ఆర్టీసీని ఆస్తులను అమ్ముకునేందుకు కేసీఆర్ ప్రయత్నం

 

బీజేపీ అధికార ప్రతినిధి రఘునందన్ రావు
సంగారెడ్డి అక్టోబర్ 7, (globelmedianews.com)
ఆర్టీసీని నిర్వీర్యం చేసి, ఆస్తులను అమ్ముకునేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని బీజేపీ అధికార ప్రతినిధి రఘునందన్ రావు ఆరోపించారు. ఆర్టీసీ భూములను కేసీఆర్ తన బంధువులకు ధారాదత్తం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఆర్టీసీ కార్మికులు భేల్ డిపో వద్ద నిరసన వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమానికి రఘునందన్ సంఘీభావం ప్రకటించారు. 
ఆర్టీసీని ఆస్తులను అమ్ముకునేందుకు కేసీఆర్ ప్రయత్నం

కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు ముందుకు రాని ప్రభుత్వం, వారిపై కుట్ర పూరితంగా వ్యవహరించడం సిగ్గు చేటని విమర్శించారు. కేసీఆర్ నిరంకుశ గడీల పాలనకు చరమగీతం పాడేందుకు అన్ని కార్మిక, ప్రజా సంఘాలు రంగంలోకి దిగుతున్నాయని అన్నారు. టీఆర్‌ఎస్ పాలనకు రోజులు దగ్గర పడ్డాయని రఘునందన్ మండిపడ్డారు.

No comments:
Write comments