పంజాగుట్టలో అమానుష ఘటన

 

హైదరాబాద్ అక్టోబర్ 16 (globelmedianews.com)
పంజాగుట్ట ప్రాంతంలో అమానుష ఘటన చోటుచేసుకుంది. అప్పుడే పుట్టిన పసికందును గుర్తుతెలియని వ్యక్తులు ఓ చెత్తకుప్పలో పడేశారు. నిమ్స్ ఆస్పత్రి ఆవరణలోని చెత్తకుప్పలో ప్లాస్టిక్ కవర్లో చుట్టి బిడ్డను వదిలి వెళ్లారు. చంటిపాప ఏడుపు విని స్థానికులు ఆ ప్రాంతానికి చేరుకున్నారు. 
పంజాగుట్టలో అమానుష ఘటన

చేత కుప్పలో ఉన్న పాపను చేరదీశారు. అనంతరం వైద్యుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు. ఆ పాపకు వైద్యులు పరీక్షలు నిర్వహించారు. పాపను ఎవరు వదిలి వెళ్లారనేది సీసీ టీవీ ఫుటేజీలో సిబ్బంది పరిశీలిస్తున్నారు. ఆడపిల్ల పుట్టిందనే కారణంతోనే పసికందును వదిలేసి ఉంటారని భావిస్తున్నారు.

No comments:
Write comments