బస్సు సమ్మెతో ఇబ్బందులు

 

హైదరాబాద్ అక్టోబరు 5, (globelmedianews.com)
హైదరాబాద్ లో ఆర్టీసీ జెఏసి ఇచ్చిన పిలుపుతో కార్మికులు చేస్తున్న సమ్మె తో అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ... దసరా , బతుకమ్మ పండుగ లకు ఊర్లకువెళ్లే వారిపై ఈ సమ్మె ఎఫెక్ట్ స్పష్టంగా కన్పిస్తోంది . కూకట్పల్లి , బీహెచ్ఈల్ ,మియాపూర్ 1,2  డిపో ల నుండి 325  బస్సు సర్వీసులు నిలిచిపోయాయి . 
బస్సు సమ్మెతో ఇబ్బందులు

ఆర్టీసీ కార్మికుల సమ్మె నోటీసుతో అలర్టయిన అధికారులు ప్రైవేటు వ్యక్తుల సాయంతో బస్సులను నడిపే ప్రయత్నం చేస్తున్నారు స్థానిక కూకట్పల్లి పోలీసులు డిపోల వద్ద 144 సెక్షన్ విధించడంతో  ఆర్టీసీకార్మికులు డిపోలకు దూరంగా నిరసనలు చేస్తున్నారు. తాత్కాలిక డ్రైవర్ , కండక్టర్ పోస్టుల కోసం బస్సు డిపోల వద్ద భారీ ఎత్తున నిరుద్యోగులు బారులు తీరిన పరిస్థితి కనిపిస్తోంది.పోలీసు భద్రత తో తాత్కాలిక సిబ్బంది సహయంతో కూకగ్ పల్లి డిపో నుండి పది బస్సులను బయటికి పంపుతామని ఆర్టీసీ అధికారులు వెల్లడించారు.

No comments:
Write comments