చంద్రబాబుది విషప్రచారం

 

తాడేపల్లి అక్టోబర్, 28 (globelmedianews.com)
రాష్ర్టంలో జలాశయాలన్నీ కూడా నిండుకుండల్లా ఉన్నాయి. వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి.నదులు సముద్రాలను తలపిస్తున్నాయి. -సెలయేర్లు జలపాతాలను తలపిస్తున్నాయి.గ్రామాలలో సాగునీరు,తాగునీరు చాలాఏళ్ల తర్వాత సమృధ్దిగా లభించాయని ప్రజలందరూ అంటున్నారని ఎంఎల్ఏ,రాష్ర్ట అధికారప్రతినిధి జోగి రమేష్ వ్యాఖ్యానించారు. సోమవారం అయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం ఇసుక కృత్రిమ కొరత సృష్టిస్తోందంటూ చంద్రబాబు,పవన్ కల్యాణ్ లు విషప్రచారం చేస్తున్నారు. కార్మికుల పక్షాన మాట్లాడుతున్నాం అనేందుకు చంద్రబాబు పవన్ కల్యాణ్ లు బిల్డప్ ఇస్తున్నారు.నిజానికి కార్మికులకు ఏం కావాలో అవి నెరవేర్చేందుకు మా ప్రభుత్వం ఉందని అన్నారు. 
చంద్రబాబుది విషప్రచారం

ఇసుక సమస్య త్వరలోనే పరిష్కారం అవుతుంది.ఇప్పటికీ ఆన్ లైన్ లో కోరిన వారికి ఇసుక పంపించడం జరుగుతుంది. గ్రామసచివాలయఉద్యోగుల ద్వారా సైతం ఇసుక కావాల్సిన వారికి అందించేఏర్పాటుచేస్తున్నాం. కృత్రిమకొరత సృష్టించాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదు.కృత్రిమ కొరత సృష్టిస్తే ప్రభుత్వానికి మంచిపేరు వస్తుందా అని ప్రశ్నించారు. వరదలు,వర్షాల నేపధ్యంలో అటు కృష్ణా,ఇటు గోదావరి నదిలో ప్రవాహం అధికంగా ఉండటం వల్ల ఇసుకతీయడం సాధ్యపడదనే విషయం ప్రజలు గమనిస్తున్నారు. ఎన్నో ఏళ్ల తర్వాత దేవుడు కరుణించాడని అది  వైయస్ జగన్ మోహన్ రెడ్డి వల్లనే జరిగిందని ప్రజలు నమ్ముతున్నారు.  ఈ సీజన్ లో నిర్మాణాలు కొనసాగవనే విషయం అందరికీ తెలుసు.ఇసుక వల్ల కొంత ఇబ్బంది ఉన్న మాట వాస్తవమే.అవినీతి లేకుండా ప్రజలకు ఇసుకను అందుబాటులో తీసుకువచ్చేందుకు ప్రభుత్వం చిత్తశుద్దితో ప్రయత్నిస్తోంది. అయినా చంద్రబాబుహయాంలో చంద్రబాబు నివాసం ఉన్న చుట్టుపక్కలనుంచి ప్రతిరోజు వందలలారీలు ఇసుక అక్రమ రవాణా జరగుతుంటే అరికట్టేందుకు చర్యలు ఏమైనా తీసుకున్నారా అన్నారు.చంద్రబాబు  అనుయాయులు, ఎంఎల్ ఏలు, మంత్రులు వందలు వేల కోట్లు ఇసుక అక్రమరవాణా ద్వారా దోచుకుంది వాస్తవం కాదా. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వందకోట్ల రూపాయల జరిమానా విధించింది వాస్తవం కాదా అని నిలదీసారు.  రాష్ర్టంలో విశ్వాసంకోల్పోయిన నేతలుగా చంద్రబాబు పవన్ కల్యాణ్ లు మిగిలిపోయారు. చంద్రబాబు నైజం ప్రజలు తెలుసుకున్నారు.అందుకే ఆయనకు 23 సీట్లు ఇచ్చారు.అవి కూడా రాబోయో రోజులలో పోబోతున్నాయి. చంద్రబాబు టిడిపి అధ్యక్షుడిగా ఉంటాడా ఉండడా అనేది కూడా తెలియడం లేదు. త్వరలో తెలుగుదేశం పార్టీ ఖాళీ అయిపోతుంది.ఆ పార్టీ ఉంటుందో లేదో తెలియని గందరగోళపరిస్దితిలో ఉంది. కొంతమంది ఎంపీలు ఆ పార్టీనుంచి వెళ్లిపోయారు.ఎంఎల్ ఏలు సైతం వెళ్లిపోతున్నారు. పవన్ కల్యాణ్ రాజకీయఅజ్ఞాని.పోటీచేసిన రెండు చోట్ల ఓడిపోయాడు.ఎప్పుడో వస్తాడు ఎప్పుడో వెళ్తాడు.  రాజకీయాలగురించి ఏమీ తెలియదు.ఊర్లుపట్టి తిరగాల్సిందే.   వైయస్ జగన్ మోహన్ రెడ్డి  ఐదు నెలల కాలంలో అనేక సంక్షేమ పధకాలు అమలు చేస్తున్నారు. రైతులు,ఆటోకార్మికులు,నవరత్నాలు ఇలా అన్నింటిని నెరవేరుస్తున్నారు. ఎంతమంది మా పార్టీలోకి రావాలనుకున్నా, జగన్ నాయకత్వం కావాలనుకున్నవాళ్లు జగన్ మోహన్ అనుసరిస్తున్న విలువలకు కట్టుబడి పదవులకు రాజీనామా చేసి రావాల్సిఉంటుందని అయన అన్నారు.

No comments:
Write comments