అడవుల రక్షణలో క్షేత్రస్థాయి బీట్ అధికారులే కీలకం

 

ఉన్నఅడవిని కాపాడు కుందాం, కొత్తగా పచ్చదనం పెంచుకునేందుకు కృషి చేద్దాం
అటవీ బీట్ అధికారుల పాసింగ్ అవుట్ పేరేడ్ లో పీసీసీఎఫ్ ఆర్. శోభ
హైదరాబాద్ అక్టోబర్ 01 (globelmedianews.com)
క్షేత్ర స్థాయి సిబ్బంది అయిన బీట్ అధికారుల మీదే అటవీ రక్షణ బాధ్యత ఉంటుందని, అన్ని రకాలుగా ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నందున శిక్షణ పొందిన బీట్ అధికారులు అందరూ నిబద్ధతతో పనిచేయాలని కోరారు ప్రధాన ముఖ్య అటవీ సంరక్షణ అధికారి ఆర్.శోభ. అసిస్టెంట్ బీట్ అధికారి నుంచి బీట్ అధికారులుగా ప్రమోషన్ పొంది దూలపల్లి ఫారెస్ట్ అకాడెమీలో శిక్షణ పొందిన అధికారుల కాన్వోకేషన్, పాసింగ్ అవుట్ పెరేడ్ లో పీసీసీఎఫ్ తో పాటు అటవీ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. గత ఏప్రిల్ 15న మొదలైన శిక్షణ శనివారంతోపూర్తయింది.
అడవుల రక్షణలో క్షేత్రస్థాయి  బీట్ అధికారులే కీలకం

27వ బ్యాచ్ నుంచి 38మంది అటవీ బీటు అధికారులు తమ ఆరు నెలల శిక్షణ కార్యక్రమాన్ని విజయవంతంగా ముగించుకున్నారు. అటవీ రక్షణ, పచ్చదనం పెంపు, స్మగ్లింగ్, వేట నియంత్రణ లాంటి అటవీ సంబంధిత 15 విషయాలతో పాటుగా వీరికి వెపన్ ట్రైనింగ్, అటవీ భూమి సర్వే చేయటం లాంటి ప్రత్యేక శిక్షణ ఈ ఆరునెలల కాలంలో ఇచ్చారు. ఈ పరీక్షలలో . బి. సజన్ లాల్, ఆసిఫాబాద్ డివిజన్ మొత్తం 950 మార్కులకు గాను 824 మార్కులు సాధించి 86.74% తో ప్రధమ స్థానము పొందినారు. అదే కాకుండా 7 సబ్జెక్టులలో ప్రధమంగా నిలిచి ఉత్తమ అల్ రౌండర్ గా కూడా బంగారు పథకాలు గెలుచుకున్నారు. అటవీ రక్షణలో తమ విధులు నెరవేర్చటంతో పాటు, ప్రజలను, స్థానిక ప్రజాప్రతినిధులను కూడా భాగస్వామ్యం చేయటం ద్వారా మంచి ఫలితాలు వస్తాయని తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి కార్పోరేషన్ ఎం.డీ పి.రఘవీర్ తెలిపారు.

No comments:
Write comments