తిరోగమనంలో గ్రానైట్

 

హైద్రాబాద్, అక్టోబరు 21, (globelmedianews.com)
నైట్‌ పరిశ్రమ గడ్డుకాలాన్ని ఎదుర్కొంటోంది. పరిశ్రమల ఏర్పాటుకు టిఎస్‌ ఐపాస్‌ ద్వారా అనుమతులు, రాయితీలు పూర్తిగా ఆన్‌లైన్‌లోనే అందుబాటులో ఉన్నాయని చెప్పిన తెలంగాణ సర్కార్‌.. ఆరేళ్లుగా రాయితీలు ఇవ్వడం లేదు. రాష్ట్రంలోని గ్రానైట్‌ పరిశ్రమకు రాయితీలు రాక నిర్వహణ భారంగా మారింది. రూ.115కోట్ల రాయితీలను ప్రభుత్వం నిలిపేసింది. ఒక్క ఖమ్మం జిల్లాలోనే దాదాపు 250 పరిశ్రమల యజమానులకు ఆరేళ్ల నుంచి రూ.25కోట్ల సబ్సిడీ విడుదల కావాల్సి ఉంది. గతంలో ప్రపంచ దేశాలకు నాణ్యమైన గ్రానైట్‌ను ఎగుమతి చేసిన ఖమ్మం జిల్లా పరిశ్రమ నేడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రోత్సాహం లేక తిరోగమనంలో ఉంది.ఖమ్మం జిల్లాలోని పలు ప్రాంతాల్లో మొత్తం 600 గ్రానైట్‌ పరిశ్రమలున్నాయి. 
తిరోగమనంలో గ్రానైట్

2017లో కేంద్ర ప్రభుత్వం జిఎస్‌టి అమల్లోకి తీసుకురావడంతో గ్రానైట్‌ రాయిపై ఏకంగా 28శాతం పన్ను విధించారు. దీంతో సుమారు 130 పరిశ్రమల వరకు పూర్తిగా మూతపడ్డాయి. ప్రస్తుతం 470 వరకు పనిచేస్తున్నాయి. అనంతరం కేంద్రం జిఎస్‌టి 18శాతానికి తగ్గించింది. నేలకొండపల్లి, ముదిగొండ, తిరుమలాయపాలెం, ఖమ్మంరూరల్‌, చింతకాని తదితర ప్రాంతాల్లో గ్రానైట్‌ నిక్షేపాలున్నాయి. పరిశ్రమలు మాత్రం ఖమ్మం రూరల్‌, నేలకొండపల్లి, ముదిగొండ ప్రాంతాల్లోనే ఎక్కువగా ఉన్నాయి. పదేళ్ల కిందటి వరకు జిల్లా నుంచి 15 దేశాలకు నలుపు, తెలుపు, ఎరుపు, ఆకుపచ్చ, గోదుమ రంగు, గులాబి రంగు రాళ్లను ఎగుమతి చేసేవారు. ప్రధానంగా ఇక్కడి నుంచి శ్రీలంక, మలేషియా, బ్రిటన్‌, టర్కీ, కొరియా, సౌదీ, చైనా తదితర దేశాలకు ఎగుమతి చేసేవారు. ప్రఖ్యాత కట్టడాలకు, గృహ నిర్మాణాల్లో ఖమ్మం జిల్లా నల్లరాయిని వినియోగిస్తారు. ఈ లెక్కన ఏడాదికి జిల్లాలో రూ.1000 కోట్లకు పైగా వ్యాపారం జరిగేదంటే అతిశయోక్తి కాదు. పరిశ్రమ లాభాల్లో ఉన్న సమయంలో ప్రత్యక్షంగా 20 వేల మంది, మరోక్షంగా మరో 80 వేల మంది పని చేసేవారు. రాష్ట్రంలోనే గ్రానైట్‌ పరిశ్రమకు ఖమ్మం జిల్లా కేరాఫ్‌గా పేరు పడింది. అయితే, ప్రస్తుతం పరిస్థితి పూర్తి తిరోగమనంలో ఉంది.సజావుగా నడుస్తున్న గ్రానైట్‌ పరిశ్రమ కుదేలవ్వడానికి అనేక కారణాలున్నాయి. ప్రధానంగా దేశీయంగా, అంతర్జాతీయంగా నిర్మాణరంగం కుప్పకూలిపోవడం. దీనికి తోడు గ్రానైట్‌ క్వారీల నిర్వహణకు ప్రభుత్వాలు ఇబ్బందులు పెడుతున్నాయి. విద్యుత్‌ సంక్షోభం, డీజిల్‌ రేట్లు, రవాణా చార్జీలు, జీఎస్టీ విపరీతంగా పెరగడం వంటి అంశాలు గ్రానైట్‌ పరిశ్రమ సంక్షోభానికి కారణమయ్యాయి. భారీ ఖర్చుతో క్వారీలను దక్కించుకున్నా.. చివరకు క్వారీలో ఏ రాయి వస్తుందో తెలియనందున యజమానులు నష్టపోతున్నారు. అనేక పోరాటాల అనంతరం జీఎస్టీలో కొంత మినహాయింపు పొందినా నష్టాలు మాత్రం తగ్గలేదు.గ్రానైట్‌ పరిశ్రమకు పేరుగాంచిన ఖమ్మంలోనూ ప్రస్తుతం నిర్వహణ భారంగా మారింది. ప్రభుత్వం నుంచి విడతల వారీగా రావాల్సి రాయితీ దాదాపు ఆరేండ్లుగా విడుదల కాకపోవడంతో పారిశ్రామిక వేత్తలు ఆందోళన చెందుతున్నారు. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా పెట్టుబడి రాయితీ, విద్యుత్‌ రాయితీ, పారిశ్రామికవేత్తలకు పావలా వడ్డీకే రుణాలు పైకం, వాణిజ్యపన్నుల సబ్సిడీ తదితర వాటికి సంబంధించిన రూ.25కోట్లు విడుదల కావాల్సి ఉంది

No comments:
Write comments