నిత్య జనగణమనకు ఏడాది

 

జగిత్యాల  అక్టోబర్ 01  (globelmedianews.com)
ప్రజల్లో జాతీయ భావం పెంపొందించేందుకు జిల్లా కేంద్రంలోని టవర్ వద్ద ఏర్పాటు చేసిన నిత్య జనగణమన అక్టోబర్ 2 తో ఏడాది పూర్తి చేసుకుంది. గత ఏడాది గాంధీ జయంతి అక్టోబర్ 2 ను పురస్కరించుకొని ప్రజల్లో జాతీయ భావంను పెంపొందించేందుకు గాను పట్టణానికి చెందిన కొందరు స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు టవర్ వద్ద నిత్యం జనగణమన ను ఆలపించే విధంగా నలుదిశలా జాతీయ జెండాలను ఏర్పాటు చేస్తుండగా, రోజు ఉదయం తొమ్మిదిన్నర గంటలకు నిత్య జనగణమన కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. 
నిత్య జనగణమనకు ఏడాది

ఇందులో భాగంగా ఉదయం తొమ్మిదిన్నర గంటలకు రోడ్లపై వెళ్తున్న వారు కుల మతాలకు అతీతంగా నిత్య జనగణమన సమయంలో ఏక్కడి వారు అక్కడి రహదారిపై వెళ్తున్న వాహన చోదకులు కూడా అక్కడే నిలిచిపోయి నిత్య జనగణమనలో పాల్గొంటున్నారు. జగిత్యాల పట్టణంలో ఏర్పాటుచేసిన నిత్య జనగణమన కార్యక్రమం అనేకమందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది. అంతేకాకుండా పట్టణంలోని పలు కూడల్లో ఏర్పాటు చేసిన ఈ నిత్యజనగణమన లో పట్టణ ప్రజలతో పాటు, రాజకీయ నాయకులు, విధ్యావేత్తలు, వైద్యులు, ఇంజనీర్లు, సీనియర్ సిటీజన్లు,తెలంగాణ ఉద్యమ నేతలు, కార్యకర్తలు, వివిధ పార్టీలకు చెందిన పూర్వ, ప్రస్తుత విద్యార్థి సంఘాల నాయకులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొoటు దేశభశక్తిని చాటుకుంటున్నారు.

No comments:
Write comments