అన్ని నియోజకవర్గాల్లో గాంధీ సంకల్ప యాత్రలు

 

అమరావతి అక్టోబరు 10, (globelmedianews.com)
ఈ నెల 13న కేంద్ర జలవనరుల మంత్రిని కలుస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు.  బాపూజీ 150వ జయంతిని పురస్కరించుకొని గాంధీ సంకల్ప యాత్ర
చేపట్టనున్నట్టు అయన వెల్లడించారు.  అన్ని నియోజకవర్గాల్లో భాజపా పార్లమెంట్ సభ్యులు ఈ యాత్రలో పాల్గొంటారన్నారు. 
అన్ని నియోజకవర్గాల్లో గాంధీ సంకల్ప యాత్రలు

గురువారం ఆయన గుంటూరులోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.  బాపూజీ సిద్ధాంతాలు పాటించడం, ఆయన ఆశయాలు సాధించడం కోసమే ఈ యాత్ర చేపట్టనున్నట్టు తెలిపారు. పోలవరం ప్రాజెక్టును రేపు సందర్శిస్తామనీ..ప్రస్తుతం ప్రాజెక్టు పురోగతి ఎలా ఉందో పరిశీలిస్తామన్నారు.  పోలవరం భవిష్యత్తు గురించి అదికారులతో చర్చిస్తామని కన్నా తెలిపారు. ఈ నెల 13న దిల్లీలో కేంద్ర జలవనరుల శాఖ మంత్రిని కలుస్తామని చెప్పారు. పోలవరం కచ్చితంగా పూర్తిచేయాలనేదే తమ పార్టీ సంకల్పమని కన్నా స్పష్టంచేశారు.

No comments:
Write comments