అమరవీరుల ఆశయాలను ఆదర్శంగా తీసుకుని శాంతి భద్రతలను నిర్వర్తించాలి

 

ఎస్పీ అపూర్వ రావు
వనపర్తి అక్టోబర్ 21 (globelmedianews.com)
దేశం కోసం ప్రాణాలను అర్పించి అమరులైన పోలీసుల ఆశయాలను ఆదర్శంగా తీసుకొని శాంతిభద్రతల పర్యవేక్షణ లో అప్రమత్తంగా విధులు నిర్వహించాలని జిల్లా ఎస్పీ అపూర్వ రావు పిలుపునిచ్చారు, అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా జిల్లా పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో సోమవారం జరిగిన అమర దినోత్సవ కార్యక్రమంలో పాల్గొని ఆమె ప్రసంగించారు. మొదటగా ఎస్పీ అపూర్వ రావు తో పాటు డిఎస్పి సృజన, ముఖ్య అతిథులు జడ్పీ చైర్మన్ లోకనాథ్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ డి వేణుగోపాల్, ఇతర పోలీసు అధికారులు అమరులైన పోలీసులకు వారి కుటుంబ సభ్యులు ఘనంగా నివాళులర్పించారు. 
అమరవీరుల ఆశయాలను ఆదర్శంగా తీసుకుని శాంతి భద్రతలను నిర్వర్తించాలి

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం వందలాది మంది పోలీసులు టెర్రరిస్టులు చేతిలో సంఘవిద్రోహ శక్తుల చేతిలో శాంతిభద్రతల పరిరక్షణలో ప్రాణాలు కోల్పోతున్నారని ఆమె విచారం వ్యక్తపరిచారు. భారతదేశంలో ఈ సంవత్సర కాలంలో 292 మంది వివిధ స్థాయిలో ఉన్న పోలీసులు అమరులయ్యారు అని ఆమె అన్నారు. వారి ఆశయాలను ముందుకు తీసుకు వెళుతూ శాంతి భద్రతల పరిరక్షణలో అప్రమత్తంగా, బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని అన్నారు. ఈ సందర్భంగా అమరవీరుల కుటుంబ సభ్యులను ఎస్పి ఘనంగా సత్కరించారు, పోలీసు అమరుల సంస్మరణ దినోత్సవం పురస్కరించుకొని వివిధ అంశాల్లో నిర్వహించిన పోటీల్లో విజేతలకు జిల్లా పరిషత్ చైర్మన్ లోకనాథ్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ డి వేణుగోపాల్, డీఎస్పీ సుజన లు బహుమతులు అందజేశారు.

No comments:
Write comments