ప్లాస్టిక్ నివారణ అందరి బాధ్యత

 

జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్
జగిత్యాల  అక్టోబర్ 15  (globelmedianews.com)
ప్లాస్టిక్ నివారణ అందరి బాధ్యత అని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పిలుపునిచ్చారు. మంగళవారం జగిత్యాల అర్బన్ మండల పరిధిలోని లింగం పేట గ్రామంలో  వాడవాడలా పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా  కుమ్మరి వృత్తి దారుల ఇండ్లకు వెళ్లి కుండల తయారీని ఇతర మట్టితో తయారు చేస్తున్న వారి పనులను పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్లాస్టిక్ వలన కలిగే పర్యావరణ కాలుష్యం అనిరోగ్య అంశాలు నష్టాలపై గ్రామ ప్రజలకు వివరించి ప్లాస్టిక్ వినియోగాన్ని నివారించాలని సూచించారు. 
ప్లాస్టిక్ నివారణ అందరి బాధ్యత

గ్రామంలో కుమ్మరులు చేస్తున్న మట్టి పాత్రలు తదితర వస్తువులను వినియోగిస్తూ కుమ్మరి కులస్తులకు చేయూతనివ్వాలని కోరారు. కుమ్మరి కులస్తులకు వెనుకబడిన తరగతుల శాఖ ద్వారా తగు సహకారం అందించేలా కృషి చేస్తానన్నారు. నూతన మున్సిపల్ చట్టం ప్రకారం 75 గజాల లోపు ఇల్లు కట్టుకుంటే ఎలాంటి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. గ్రామంలో పలుచోట్ల కాలినడకన పర్యటించిన ఎమ్మెల్యే గ్రామస్తులు పారిశుద్ధ్యంపై తీసుకుంటున్న చొరవను  అభినందించారు తడి పొడి చెత్త  నిర్వహణకు డబ్బాలను ఏర్పాటు చేయాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. ఎలుక బావి వాడలో నీటి సమస్యకు శాశ్వత పరిష్కా రా లకు ఎస్సీ కాలనీలో సమస్యలు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ వెంకట నర్సయ్య , మాజీ ఉపసర్పంచ్ లక్ష్మణ్, టిఆర్ఎస్ జిల్లా నాయకులు హరి అశోక్ కుమార్, జి ఆర్ దేశాయ్, సమిండ్ల శ్రీనివాస్, మూసి పట్ల లింగన్న, భోగ వెంకటేశ్వరలు,మానల కిషన్, గ్రామ నాయకులు ఆరు ముళ్ళ పవన్, రాజ్ కుమార్, ఉదయ్, రమేష్, చిరంజీవి, శ్రీనివాస్, రెడ్డి, పవన్, మహేష్, తదితరులు పాల్గొన్నారు.

No comments:
Write comments