మత్స్యకారుల అభివృద్ధియే ప్రభుత్వ ధ్యేయం

 

వనపర్తి అక్టోబర్ 10 (globelmedianews.com)
మత్స్యకారుల అభివృద్ధి కోసం  చెరువులలో చేపపిల్లలను వదిలి వారి అభివృద్ధియే ప్రభుత్వం దెయ్యంగా పెట్టుకున్న దని గోపాల్ పేట ఎంపిపి సంధ్య తిరుపతి యాదవ్, జడ్పిటిసి భార్గవి కోటేశ్వర్ రెడ్డి లు అన్నారు. వారు గురువారం వనపర్తి జిల్లా గోపాల్ పేట మండలం తాడిపర్తి చెరువులో లక్ష చేపపిల్లలను వదిలారు. 
మత్స్యకారుల అభివృద్ధియే ప్రభుత్వ ధ్యేయం

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మత్స్యకారుల అభివృద్ధి తో పాటు ప్రతి ఒక్కరి అభివృద్ధి కోసం ప్రభుత్వం ఎన్నో పథకాలను అమల పరుస్తుందని వారన్నారు. ప్రభుత్వం అమలు పరుస్తున్న సంక్షేమ పథకాలన్నీ ప్రతి ఒక్కరు సద్వినియోగ పరచుకుని అభివృద్ధి చెందాలని వారన్నారు. ఈ కార్యక్రమంలో మండల వైస్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్. కో ఆప్షన్ సభ్యులు మతిన్ తో పాటు గ్రామస్తులు శంకరయ్య తదితరులు పాల్గొని చెరువులో చేపపిల్లలను వదిలారు.

No comments:
Write comments