ఏపీబీ వలలో ఎంవీఐ

 

కర్నూలు  అక్టోబరు 3, (globelmedianews.com)
అవినీతి నిరోధక శాఖ అధికారులకు కర్నూలు జిల్లా మోటారు వెహికల్ ఇన్స్పెక్టర్ శివప్రసాద్ చిక్కారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగివున్నారన్న సమాచారంతో ఈ రోజు ఆయనఇంటిపై అధికారులు దాడులు చేసి సోదాలు నిర్వహిస్తున్నారు. కర్నూలు సహా హైదరాబాద్, బెంగళూరు లోని రెండు ప్రాంతాలు, తాడిపత్రిలో ఏకకాలంలో సోదాలు సాగుతున్నాయి.ఇప్పటి వరకు 8 కోట్ల రూపాయల విలువ చేసే అక్రమ సంపాదన కూడబెట్టినట్లు లెక్కతేల్చారు.
ఏపీబీ వలలో ఎంవీఐ

అలాగే, భార్య పేరు మీదు శివప్రసాద్ రెండు సూట్ కేసు కంపెనీలను నడుపుతున్నట్లు ఏసీబీ అధికారులు తనిఖీల్లో బయటపడింది.  బెంగళూరులోని కార్తీక్ నగర్లో మూడు కోట్ల విలువైన జీప్లస్ సెవెన్ అపార్ట్ మెంట్, ఉదాల్ హల్లిలో రెండు కోట్ల విలువ చేసే ఇంటి స్థలం.  హైదరాబాద్లోని జయభేరి ఆరెంజ్ ఆర్కేట్ లో కోటిన్నర విలువచేసే అపార్ట్మెంట్, గాజుల మల్లాపురంలోకోటి రూపాయల ఇంటి స్థలం.  ప్రస్తుతం నివాసం ఉంటున్న ఇంట్లో రూ.1.45 లక్షల నగదు, కిలో బంగారం లభించింది.   మనీ ట్రాన్స్ఫర్ కోసం భార్య పేరు మీద ఆక్సీ ట్రీ హోటల్ ప్రైవేట్లిమిటెడ్ , సిన్బిడ్స్ అనే రెండు సూట్ కేసు కంపెనీలను అయన నడుపుతున్నారు.  ఉగాండా దేశంలోని  బ్యాంకుల్లో లాకర్స్ ఉన్నాయి.

No comments:
Write comments