టీడీపీ అభ్యర్ధిని గెలిపించాలి

 

సూర్యాపేట అక్టోబరు 5, (globelmedianews.com)
హుజుర్ నగర్ పట్టణంలోని  సాయి కళ్యాణమండపంలో ఉపఎన్నిక టిడిపి అభర్థిని చావా కిరణ్మయి ఆధ్వర్యంలో టిడిపి ముఖ్యనాయకుల, కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షడు ఎల్.రమణ, పొలిట్ బ్యూరో సభ్యులు రావుల చంద్రశేఖర్ రెడ్డి, అరవింద్ కుమార్, నర్సిరెడ్డి, మొదలగు అగ్రనేతలుహజరయ్యారు.
టీడీపీ అభ్యర్ధిని గెలిపించాలి

ఈ సందర్బంగా ఎల్. రమణ మాట్లాడుతూ  హుజుర్ నగర్ ఉపఎన్నికలో టి.డి.పి నుంచి పోటీచేస్తున్న చావా కిరణ్మయిని గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. అందుకోసం పార్టీనాయకులు, కార్యకర్తలు సైనుకుల్లాగా పనిచేసి విజయం కోసం పోరాడాలన్నారు. హుజుర్ నగర్ లో పార్టీ గెలుపు కోసం అనుసరించాల్సిన వ్యూహాలను పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ది శానిర్దేశం చేశారు. తెలంగాణా రాష్ట్రంలో టి.ఆర్.ఎస్ ప్రభుత్వం చేసిందేమిలేదని, ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో టి.ఆర్.ఎస్ ప్రభుత్వం విఫలం అయిందని విమర్శించారు. తెలంగాణాఅభివృద్ధి అనేది టి.డి.పి హయాంలోనే జరిగిందని, కొత్తగా టి.ఆర్.ఎస్ ప్రభుత్వం చేసిందేమీ లేదన్నారు. దళితులకు 3ఎకరాల భూమి, డబుల్ బెడ్రూం, రైతు బంధు మొదలైన ప్రధాన సమస్యలను పక్కనబెట్టిందని అన్నారు

No comments:
Write comments