నెల్లూరులో భారీ వర్షాలు

 

నెల్లూరు అక్టోబరు 22, (globelmedianews.com)
నెల్లూరు జిల్లాలో నాలుగురోజులగా వర్షం ఎడతెరిపి లేకుండా కురుస్తోంది. సోమవారం  29.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అయింది.  జిల్లాలో వాగులు, చెరువులు జలకళను సంతరించుకున్నాయి.  రబీకి సిద్దమైన రైతన్నలు, జిల్లాలో 7లక్షల ఎకరాల్లో సాగుకు సన్నద్ధం చేస్తున్నారు.    
నెల్లూరులో భారీ వర్షాలు

సోమశిల జలాశయం నుంచి జిల్లాలోని పంటకాలువలకు అధికారులు నీటిని విడుదల చేయనున్నారు. - చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందిస్తామని మంత్రులు అంటున్నారు.  లోతట్టు ప్రాంతాలను అప్రమత్తం చేసారు.   చాలా కాలం తర్వాత వర్షం వస్తుండడంతో ఆనందం వ్యక్తం చేస్తున్న జిల్లా వాసులు, తాగు, సాగునీటి కష్టాలు తీరనున్నాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

No comments:
Write comments