సిండికేట్ బ్యాంకు లో ఖాతా దారులు ఇబ్బందులు

 

డోర్లు ముసివేసి  చేతులెత్తేసిన బ్యాంక్ సిబ్బంది
బయట పడి గాపులు గాస్తున్న ఖాతాదారులు
కౌతాళం అక్టోబర్ 18 (globelmedianews.com):
సిండికేట్ బ్యాంక్ లో ఖాతాదారులు ఆర్థిక ఇబ్బందులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. సిండికేట్ బ్యాంకు చాలా చిన్నది ఉండడంతో అనేక ఇబ్బందులు తలెత్తుతున్నాయి. రైతులు వైఎస్ఆర్ రైతు భరోసా కింద ఖాతాదారులకు డబ్బులు పడడంతో ఖాతాదారులు చాలామంది వచ్చి సిండికేట్ బ్యాంక్ లో గంటల తరబడి కూర్చున్న పని కావడం లేదంటూ వాపోతున్నారు. గట్టిగా నిలదీసి అడిగితే నెట్వర్క్ ప్రాబ్లం అంటూ, సర్వర్ ప్రాబ్లం అంటూ చేతులెత్తేస్తున్నారు. 
సిండికేట్ బ్యాంకు లో ఖాతా దారులు ఇబ్బందులు

సిండి కెట్ సిబ్బంది ఇదే ఇదేమిటని ఖాతాదారులు గట్టిగా అడగగా ఏమి పని జరగదు పొండి డబ్బుల్లేవ్ ఉంటూ డోర్లు మూసేస్తున్నారు. గంటల తరబడి కూర్చొని పని అవ్వక వెళ్లిపోతున్నారు. రైతులు ఖాతా దారులు ఇబ్బందులు పడుతున్నా చిన్న పటి వసతులు కల్పించడంలో అధికారులు విఫలం అయ్యారని వాపోయారు. కానీ ప్రభుత్వ అధికారులు మాత్రం పట్టించుకో కపోవడం గమనార్హం మన బతుకులు ఇంతేనా మన తల రాతలు ఇంతేనా అనుకుంటున్నారు. పై అధికారులు స్పందించి సిండికేట్ బ్యాంక్ ను సిబ్బంది నీ మార్చాలని కోరుతున్నారు.

No comments:
Write comments