పాకిస్థాన్ లో ఘోర ప్రమాదం…పదమూడు మంది మృతి

 

ఇస్లామాబాద్ అక్టోబర్ 31, (globelmedianews.com)
పాకిస్థాన్ లో ఘోర రైలు ప్రమాదం జరిగింది.   కరాచీ-రావల్పిండి తేజ్ గామ్ ఎక్స్ ప్రెస్ లో మంటలు చెలరేగాయి.  ఈ ఘటనలో 16 మంది మృతి చెందగా, 13 మందికి తీవ్ర గాయాలయ్యాయి.  క్షతగాత్రులను వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.  రైలు ప్రయాణికులు వంట చేస్తుండగా సిలిండర్ పేలి ఈ ప్రమాదం జరిగింది. 
పాకిస్థాన్ లో ఘోర ప్రమాదం…పదమూడు మంది మృతి

రహీం యార్ ఖాన్ నగరం సమీపంలో జరిగిన ఈ ఘటన లో మూడు బోగీలు దగ్దం అయ్యాయి. మంటలు చేలరేగగానే కొందరు వేగంగా వెళుతున్న రైలు నుంచి దూకేసారు. అధికారికంగా రైళ్లల్లో వంట చేయడం నిషేధించినా, ప్రజలు దూర ప్రాంతానికి వెళుతున్నప్పుడు వంట చేసుకోవడం సాధారణం.

No comments:
Write comments