కోర్టుకు చేరిన స్వరూపనంద కోకాపేట వ్యవహారం

 

హైద్రాబాద్, అక్టోబరు 1, (globelmedianews.com)
తెలంగాణ ప్రభుత్వం కోకాపేటలో స్వరూపానంద స్వామికి ఎకరానికి రూపాయి చొప్పన రెండు ఎకరాలు కేటాయించడంపై ఓ వ్యక్తి హైకోర్టులో పిటిషన్ వేశారు. నిబంధనలకు విరుద్ధంగా రూపాయికేస్వరూపానందకు భూములు కేటాయించారని.. వీరాచారి అనే వ్యక్తి ఈపిటిషన్ వేశారు. ఈ భూముల కేటాయింపు అక్రమమని చెబుతున్నారు. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన హైకోర్టు ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. నిజానికి స్వరూపానంద ఆశ్రమానికి రెండు ఎకరాల కేటాయింపు వ్యవహారం మొదటి నుంచి వివాదాస్పదమవుతోంది. ఇప్పుడు కోర్టుకు చేరింది. ప్రభుత్వానికి చెందిన భూములను ఎవరికైనా కేటాయించాలంటే.. నిర్దిష్టమైన కారణాలు ఉండాలి. పరిశ్రమలు స్థాపించి.. ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్న వారికో వృద్ధాశ్రమం పెడతామరోసేవా కార్యక్రమాలు చేస్తామనో.. చెప్పి.. భూములు అడగవచ్చు. 
కోర్టుకు చేరిన  స్వరూపనంద కోకాపేట వ్యవహారం

వారి నిబద్ధత.. ట్రాక్ రికార్డు చూసిప్రభుత్వం భూములు కేటాయిస్తుంది. అలాగే దేశం కోసం జీవితాలను త్యాగం చేసిన వారికి నివాస స్థలాలు కేటాయిస్తారు. కొన్ని సార్లు సాగుభూమి కూడా కేటాయిస్తారు. ఇవన్నీ పక్కాగా నిబంధనల ప్రకారం జరుగుతాయి. ఏదైనా.. ప్రజాప్రయోజనాన్నే ప్రధానంగా చూపిస్తారు. కానీ స్వరూపానంద ఆశ్రమానికి రెండు ఎకరాలను ఏ కేటగరిలో తెలంగాణ సర్కార్ కేటాయించిదో క్లారిటీ లేదు. స్వరూపానంద స్వామి.. ఇటీవలి కాలంలో.. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు అత్యంత సన్నిహితుడయ్యారు. ఆయన  జగన్మోహన్ రెడ్డి కోసం ఏకంగా తపస్సు చేశానని చెప్పుకున్నారు. కేసీఆర్ కోసం… రాజశ్యామల యాగాలు చేశారు. ఇద్దరూ గెలిచారు. గెలుపునకు కారణాలు ఏమైనా స్వరూపానంద పూజలు కూడా కారణమని.. ఇద్దరూ నమ్ముతున్నారు. కేసీఆర్ కోకాపేటలో రెండు ఎకరాలను.. స్వరూపానంద ఆశ్రమానికి కేటాయించారు. అమరావతిలో ఆరు ఎకరాలు కావాలని జగన్ కు పిటిషన్ పెట్టుకున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో.. హైదరాబాద్ రెండెకరాల వ్యవహారం కోర్టుకు చేరడం ఆసక్తి రేపుతోంది. ఇటీవలి కాలంలో.. తెలంగాణ కేబినెట్ నిర్ణయాలను కూడా.. హైకోర్టు కొట్టి వేస్తోంది. అందుకే ఈ పిటిషన్ న్యాయ వర్గాల్లోనూ ఆసక్తి రేపుతోంది.

No comments:
Write comments