పునర్విభజనతో రూరల్ లో పెరిగిన అవకాశాలు

 

వరంగల్, అక్టోబరు 15, (globelmedianews.com)
వరంగల్ జిల్లాల ప్రగతి పరుగు పెడుతుంది. పాలన ప్రజల ముంగిట్లోకి చేరింది. ప్రజలు ఆశించిన ఫలాలు పొందుతున్నారు.కొత్త జిల్లాల ఏర్పాటుతో ప్రభుత్వ పథకాల అమల్లో క్షేత్రస్థాయిలో అధికారులు మానిటరింగ్ చేస్తున్నారు. అభివృద్ధ్ది, సంక్షే మ కార్యక్రమాలను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. గ్రామాలు సందర్శించి ప్రజల సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరించటంపై దృష్టి సారిస్తున్నారు. ప్రభుత్వ ప్రాధాన్య పథకాల అమ ల్లో ప్రత్యేక నజర్ పెడుతున్నారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన భూరికార్డుల ప్రక్షాళన కార్యక్రమం నిర్వహణకు రెవె న్యూ అధికారులు గ్రామాల్లో రైతులతో సదస్సులు నిర్వహించా రు. భూసంబంధ సమస్యలు తెలుసుకుని పరిష్కరిస్తున్నారు.
 పునర్విభజనతో రూరల్ లో పెరిగిన అవకాశాలు

రికార్డులను పరిశీలించి, క్షేత్రస్థాయిలో విచారణ జరిపి రైతులకు కొత్త పట్టాదారు పాసుపుస్తకాలు అందజేస్తున్నారు. ప్రభుత్వ పథకాల అమల్లో పారదర్శకత నెలకొంది. అడుగడుగున జవాబుదారితనం పెరిగింది. అన్ని రంగాల్లోనూ ఊహించిన ప్రగతి కనపడుతుంది. పల్లెలు, పట్టణాలు శరవేగంగా అభివృద్ధ్ది చెందుతున్నాయి. సంక్షేమ కార్యక్రమాలు గడప గడపను తడుతుండటంతో ప్రజలు సంబుర పడుతున్నారు. గతంలో కార్యాలయాల చుట్టు తిరిగినా కానరాని అధికారులు ఇపుడు తమ చెంతకే వస్తుండటంతో మురిసిపోతున్నారు. చిన్న జిల్లాల ఏర్పాటు తర్వాత గత మూడేళ్లలో జిల్లా వ్యవసాయం, పారిశ్రామిక అభివృద్ధ్ది దిశలో అడుగులు వేసింది. ప్రధానంగా కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కుతో జిల్లాకు అంతర్జాతీయ గుర్తింపు దక్కింది. పాలన సౌలభ్యం కోసం తెలంగాణ ప్రభుత్వం జిల్లాల పునర్విభజన చేపట్టింది. ఈ మేరకు 23 కొత్త జిల్లాలు ఏర్పాటు చేసింది. వీటిలో 21 జిల్లాలు 2016 అక్టోబరు 11 నుంచి ఉనికిలోకి వచ్చాయి. వరంగల్‌రూరల్ ఈ జిల్లాల్లో ఒకటి. జిల్లా ప్రజలు మూడేళ్లలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను నెమరు వేసుకుంటున్నారు. వ్యవసాయపరంగా ప్రత్యేకతను సంతరించుకున్న ఈ జిల్లా కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కు ఏర్పాటుతో పారిశ్రామికంగా రూపాంతరం చెందుతుంది. విదేశాలకు దీటు గా ఇక్కడ కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కు పురుడు పోసుకుంది. గీసుకొండ మండలంలోని శాయంపేట హవేలి, సంగెం మండలంలోని చింతలపల్లి గ్రామాల మధ్య 1,314 ఎకరాల విస్తీర్ణంలో కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కు నిర్మాణానికి 2017 అక్టోబరు 22న ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు శంకుస్థాపన చేశారు. ఇది జిల్లా రూపురేఖలు మారటానికి దోహదపడింది. ప్రత్యక్షం, పరోక్షంగా అనేక మందికి ఉపాధినిచ్చే ఈ పార్కు ప్రభుత్వరంగంలో అతి పెద్దది. కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కు కోసం అధికారులు ఇప్పటికే 1,160 ఎకరాల భూమి సేకరించారు. ఈ పార్కులో మౌలిక వసతుల కోసం ప్రభుత్వం రూ.130 కోట్లు వెచ్చించింది. ఇటీవల జరిగిన శాసనమండలి సమావేశంలో ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి అడిగిన ప్రశ్నలకు రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలకశాఖ మంత్రి కేటీ రామారావు సమాధానమిస్తూ కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కులో ఇప్పటివరకు రూ.4,500 కోట్ల పెట్టుబడులతో 16 ఒప్పందాలు జరిగినట్లు ప్రకటించారు. ఈ టెక్స్‌టైల్ ద్వారా ప్రత్యక్షం, పరోక్షంగా 1.13 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. ఇప్పటికే తొంభై శాతానికిపైగా ఈ పార్కులో అంతర్గత రోడ్ల నిర్మాణం, 33/11 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణం వంద శాతం పూర్తయిందని చెప్పారు. ఇక్కడ మెరుగైన విద్యుత్ సరఫరా కోసం రూ.100 కోట్లతో 132 కేవీ సబ్ స్టేషన్ నిర్మాణం చేపట్టాలని కూడా నిర్ణయించినట్లు మంత్రి వెల్లడించారు. ఈ క్రమంలో కొద్ది రోజుల క్రితం ఎన్పీడీసీఎల సీఎండీ ఏ గోపాల్‌రావు కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కును సందర్శించారు. ఇక్కడ 132 కేవీ సబ్‌స్టేషన్ నిర్మాణం ప్రతిపాదనలపై సంబంధిత అధికారులతో చర్చించారు. ప్రస్తుతం ఈ పార్కుకు సంబంధించి మిగులు భూమి సేకరించే పనిలో రెవెన్యూ అధికారులు ఉన్నారు.జిల్లా కలెక్టర్ ఎం హరిత రాష్ట్రంలో మరెక్కడా లేని విధంగా కలెక్టరేట్ నుంచి నేరుగా రిజిస్టర్ పోస్టు ద్వారా పట్టాదారు పాస్ బుక్స్ రైతులకు అందించే వినూత్న కార్యక్రమం చేపట్టారు. వీఆర్‌వోల ద్వారా రైతులకు పాస్ బుక్స్ పంపిణీ చేయడంలో సమస్యలు ఎదురవుతున్నాయని ఆమె ఈ నిర్ణయం తీసుకుని అమల్లోకి తెచ్చారు. ప్రస్తుతం రిజిస్టర్ పోస్టు ద్వారా పట్టాదారు పాస్ పుస్తకాలను రైతులు అందుకుంటున్నారు. బాలికలపై లైంగిక దాడులు పెరిగిన నేపథ్యంలో జిల్లాలో కలెక్టర్ హరిత బాల్యానికి భరోస కార్యక్రమం చేపట్టి తన మార్కు చూపుతున్నారు. ప్రస్తుతం జిల్లాలోని ప్రభుత్వ విద్యా సంస్థల్లో ఈ కార్యక్రమాన్ని పక్కాగా అమలు చేస్తున్నారు. చిన్న జిల్లా కావటం వల్ల ప్రభు త్వం చేపట్టిన వ్యవసాయరంగానికి 24 గంటల ఉచిత విద్యుత్, పంట పెట్టుబడికి రైతు బంధు పథకం నుంచి ప్రతీ సంవత్సరం ఎకరానికి రూ.10 వేల ఆర్థిక సహాయం, రూ.5 లక్షల రైతు బీమా, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, మిషన్ కాకతీయతో చెరువుల పునరుద్ధ్దరణ పనులు, మిషన్ భగీరథ నుంచి ఇంటింటికి నల్లా ద్వారా తాగునీటి సరఫరా, పారిశుధ్యం, హరితహారం, డబుల్ బెడ్‌రూం ఇండ్లు, రహదారుల నిర్మాణం, సబ్సిడీ గొర్రెలు, ఉచిత చేప పిల్లల పంపిణీ తదితర పథకాల అమల్లో ఆశించిన ప్రగతి కనపడుతుంది.జిల్లా ఆవిర్భావంతో కొత్తగా జిల్లాలో రెండు రెవెన్యూ డివిజన్లు ఏర్పడ్డాయి. గతంలో నర్సంపేట కేంద్రంగా ఒక రెవె న్యూ డివిజన్ పనిచేసింది. కొత్త జిల్లాల ఏర్పాటుతో మొదట జిల్లాలో వరంగల్ రూరల్ రెవెన్యూ డివిజన్ ఆవిర్భవించింది. ఆ తర్వాత పరకాల కేం ద్రంగా రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలనే ప్రజల ఆకాంక్షను సీఎం కేసీఆర్ నెరవేర్చారు. 2017 అక్టోబరు 22న కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కుకు శంకుస్థాప న చేసిన సమయంలో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి వినతి మేరకు పరకాల కేంద్రంగా రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు సీఎం కేసీఆర్ ప్రకటన చేశారు. దీంతో పరకాల కేంద్రంగా జిల్లాలో ఐదు మండలాలతో మూడో రెవెన్యూ డివిజన్ వెలిసింది. ప్రస్తుతం జిల్లాలో న ర్సంపేట, వరంగల్‌రూరల్, పరకాల రెవెన్యూ డివిజన్లు పనిచేస్తున్నాయి. జిల్లాలో ప్రస్తు తం మండలాల సంఖ్య పదహారు. వీటిలో రాయపర్తి, వర్ధ్దన్నపేట, పర్వతగిరి, సంగెం, గీసుకొండ, ఆత్మకూరు, దామెర, శాయంపేట, పరకాల, నడికూడ, దుగ్గొండి, నల్లబెల్లి, నర్సంపేట, ఖానాపూర్, చెన్నారావుపేట, నెక్కొండ ఉన్నాయి. ఈ పదహారింటిలో దామెర, నడికూడ కొత్తగా ఏర్పడిన మండలాలు. కొత్త జిల్లాతో పాటు రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటుపై ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పనుల కోసం దూర ప్రాం తానికి వెళ్లాల్సిన ఇబ్బంది తప్పిందని ఆనంద పడుతున్నారు.

No comments:
Write comments