అసైన్డు రికార్డుల ప్రక్షాళన దిశగా చర్యలు

 

నిజామాబాద్, అక్టోబరు 23, (globelmedianews.com)
సర్కారు రాష్ట్రంలోని అసైన్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  భూముల లెక్కలను తేల్చే పనిలో పడింది. భూరికార్డుల ప్రక్షాళన 85 శాతం దాకా పూర్తవడం, అసైన్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  భూముల వివరాలపై కాస్త స్పష్టత రావడంతో చర్యలు మొదలుపెట్టింది. పేదల వద్ద ఎన్ని అసైన్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ భూములున్నాయి, ధనికుల చేతుల్లోకి వెళ్లిన భూములెన్ని? అన్న వివరాలను సేకరిస్తోంది. వాస్తవానికి అసైన్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  భూముల చట్టం–1977 ప్రకారం పేదలకు అసైన్ చేసిన భూములను మరొకరికి అమ్మడానికి, కొనడానికి వీల్లేదు. ఈ విషయం తెలియని అనేక మంది రైతులు ప్రభుత్వం ఇచ్చిన భూములు అమ్మేసుకున్నారు. భూరికార్డుల ప్రక్షాళన (ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌యూపీ) సందర్భంగా భారీగా అసైన్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ భూముల కొనుగోలు వ్యవహారం వెలుగు చూసింది. 
 అసైన్డు రికార్డుల ప్రక్షాళన దిశగా చర్యలు

రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 20 లక్షల 13 వేల 863 ఎకరాల అసైన్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ భూములు ఉండగా.. అందులో 2 లక్షల 41 వేల 126 ఎకరాల భూములు చేతులు మారినట్టు అధికారులు గుర్తించారు. ఆ భూములకు పట్టాదార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బుక్కులు ఇవ్వకుండా పెండింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పెట్టారు. కొనుగోలు చేసినవారిలోనూ చాలా వరకు పేదలే ఉండడంతో వారికి న్యాయం చేసేందుకు ప్రభుత్వం 2018 మార్చిలో అసైన్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ భూముల చట్టానికి సవరణ చేసింది. దాని ప్రకారం అర్హులైన పేదలకు రెవెన్యూ శాఖ పట్టాదారు పాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బుక్కులు జారీ చేసింది.పేదలకు ఇచ్చిన భూములు పోగా కొన్ని వేల ఎకరాల అసైన్డ్ భూములు డబ్బున్నవాళ్ల చేతుల్లో ఉన్నట్టు అధికారులు గుర్తించారు. అందులో గ్రేటర్ హైదరాబాద్ శివార్లలో, జిల్లా కేంద్రాలకు సమీపంలో ఉన్న విలువైన భూములూ ఉన్నట్టు తేల్చారు. ఈ భూములను తిరిగి స్వాధీనం చేసుకునే ఉద్దేశంతో వాటి వివరాలు సేకరిస్తున్నట్టు తెలిసింది. పూర్తిస్థాయిలో వివరాలు సేకరించాక ప్రాంతాన్ని బట్టి మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ధర ప్రకారం సంబంధిత వ్యక్తులకు రెగ్యులరైజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయడం, లేదా వేలం వేసి నిధులు సమీకరించుకోవడంపై సర్కారు దృష్టి సారించినట్టు సమాచారం.రాష్ట్రవ్యాప్తంగా 20 లక్షల 13 వేల 863 ఎకరాల అసైన్డ్ భూములు ఉన్నాయి. జిల్లాల వారీగా చూస్తే.. అత్యధికంగా ఆసిఫాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జిల్లాలో 1,85,101 ఎకరాలు, భద్రాద్రి కొత్తగూడెంలో 1,66,557 ఎకరాలు, నల్గొండలో 1,36,686 ఎకరాలు, కామారెడ్డిలో 1,33,157 ఎకరాలు ఉన్నాయి. 6,33,451 మంది బీసీల వద్ద 8,14,008 ఎకరాలు ఉండగా, ఎస్సీల వద్ద 5,75,497 ఎకరాలు, ఎస్టీల వద్ద 6,72,959 ఎకరాలు, ఓసీల వద్ద 1,46,102 ఎకరాలు, మైనార్టీల వద్ద 54,565 ఎకరాలు అసైన్డ్ భూములు ఉన్నట్టు భూరికార్డుల ప్రక్షాళనలో తేలింది.

No comments:
Write comments