ఆర్జీలను వందశాతం పరిష్కరించండి

 

కర్నూలు అక్టోబరు 5, (globelmedianews.com)
శనివారం ఉదయం జరిగిన డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమం లో 26 ఫోన్ కాల్స్ ద్వారా సమస్యలు విని, సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ జి.వీరపాండియన్, జెసి రవి పట్టన్ శెట్టిఅధికారులను ఆదేశించారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగ నియామకాలన్నీ సక్ర మ మే. .పుకార్లు పుట్టిస్తే క్రిమినల్ కేసులు. స్పందన అర్జీల తిరస్కారం  పరిష్కారం కాదు.. చిన్న చిన్నకారణాలతో అర్జీలను తిరస్కరించకుండా, అర్జీదారులతో మాట్లాడి వారు సంతృప్తి చెందేలా అర్ధ వంతంగా  వందశాతం పరిష్కరించండని సూచించారు. 
ఆర్జీలను వందశాతం పరిష్కరించండి

జిల్లాలో 7శాతం పెండింగ్ ఉన్న స్పందన అర్జీలను, 8 శాతం పెండింగ్ ఉన్న సిఎంఓ అర్జీలను సత్వరమే పరిష్కరించండి. ఈ నెల 10 న ప్రారంభం అయ్యే వైఎస్ఆర్ కంటి వెలుగు, 15 న ప్రారంభం కానున్న వైఎస్ఆర్రైతు భరోసా పథకాల లబ్ధిదారుల జాబితాను పగడ్బందీగా సిద్ధం చేసి, పథకాలనువిజయవంతం గా అమలు చేయడానికి చేపట్టిన చర్యలను వేగవంతంగా, పారదర్శకంగా పూర్తిచేయండని కలెక్టర్ అన్నారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల శిక్షణా కార్యక్రమాలను బాగా నిర్వహించండి. గ్రామ, వార్డ్ సచివాలయ ఉద్యోగుల ఖాళీలు ఉంటే ప్రభుత్వ గైడ్ లైన్స్ప్రకారం భర్తీ చేయండి.  నెల 15 లోపు గ్రామ, వార్డు వాలంటీర్ల ఖాళీలను ప్రభుత్వ రూల్స్ ప్రకారం భర్తీ చేయండని అన్నారు.

No comments:
Write comments