తడిసిన ధాన్యం..ధైన్యంలో రైతులు

 

నిజామాబాద్ అక్టోబరు 22, (globelmedianews.com)
సన్నకారు రైతుల పట్ల అకాల వర్షం శాపంగా మారుతుంది. ఆరుగాలం కష్టపడి పండించిన పంట కళ్ళ ముందే తడిసి ముద్ద అవుతున్నా ఏమి చేయలేక నిస్సహాయంగా ఉండిపోతున్నామని రైతులు వాపోతున్నారు. నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గం లో రేండు రోజులనుండి కురుస్తున్న భారి వర్షానికి వేల క్వింటాళ్ళ వరి ధాన్యం తడిసి ముద్ద అయ్యింది. నవిపేట్ మండలం లో తడిసిన ధాన్యం మొలకెత్తడంతో రైతులు కన్నీటి పర్యంతం అవుతున్నారు. అకాల వర్షం తో పంట నేల పాలయి  రైతులకు అన్ని విధాల నష్టం వాటిల్లింది. 
తడిసిన ధాన్యం..ధైన్యంలో రైతులు

ఇంత జరుగుతున్నా సహకార సంఘం ఆధ్వర్యంలో నిర్వహించే ప్రభుత్వ కాటా ఇప్పటి వరకు ఏర్పాటు చెయ్యకపోవడం పై రైతులు మండి పడుతున్నారు. ప్రభుత్వం ధాన్యానికి  గిట్టుబాటు ధర ప్రకటించి పది రోజులు కావస్తున్నా ఒక్క కొనుగోలు కేంద్రం కూడా మండలం లో ఏర్పాటు చెయ్యక పోవడం పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికారులు కనీసం నష్ట పోయిన పంటలను, తడిసిన ధాన్యాన్ని కనీసం సందర్శించి రైతులతో మాట్లాడకపోవడం సిగ్గు చేటని అంటున్నారు. ఇప్పటికైనా అధికారులు, నాయకులు స్పందించి ప్రబుత్వ కొనుగోలు కేంద్రాలను వెంటనే ఏర్పాటు చెయ్యాలని కోరుతున్నారు.

No comments:
Write comments