సమ్మె విరమించాక చర్చలు జరుపుతామనడం హాస్యాస్పదం

 

విమలక్క ఆగ్రహం
హైదరాబాద్ అక్టోబర్ 19  (globelmedianews.com)
ఆర్టీసీ కార్మికులు తమ సమ్మె విరమించిన తర్వాత చర్చలు జరుపుతామని తెలంగాణ ప్రభుత్వం చెప్పడం హాస్యాస్పదంగా ఉందని ‘అరుణోదయ’ కళాకారిణి విమలక్క అన్నారు. సమ్మె విరమించాక చర్చలేముంటాయి? మాట్లాడే మాటలకు అర్థం ఉండాలని ప్రభుత్వంపై ఆమె నిప్పులు చెరిగారు.  
సమ్మె విరమించాక చర్చలు జరుపుతామనడం హాస్యాస్పదం

ఆర్టీసీ జేఏసీ ఈరోజు తలపెట్టిన బంద్ కు మద్దతుగా ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వద్ద చేపట్టిన నిరసన కార్యక్రమాల్లో ఆమె పాల్గొన్నారు.ఈ సందర్భంగా విమలక్క మాట్లాడుతూ, సమ్మె చేయడం కార్మికుల జన్మహక్కు అని అన్నారు. ముందుగా, చర్చలు జరిపితే, ఆ తర్వాత సమ్మె విరమిస్తారన్నారు. ఈ నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నవాళ్లలో చాలా మంది మహిళలు ఉన్నారు, అదుపు చేసేందుకు వచ్చిన వారిలో మహిళా పోలీసులు లేకపోవడం దారుణమని విమర్శించారు.  

No comments:
Write comments