మంత్రి బుగ్గన కు వినతుల వెల్లువ

 

బేతంచర్ల అక్టోబర్ 1 (globelmedianews.com)
రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కి ప్రజల నుండి సమస్యల వినతులు  వెల్లువ ల వచ్చాయి. మంగళవారం నాడు స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయం నందు మంత్రిబేతంచెర్ల మండలం లోని వివిధ గ్రామాల నుండి వచ్చిన ప్రజల నుండి వినతులను స్వీకరించారు అలాగే గ్రామాల్లో నెలకొన్న సమస్యలను మంత్రి దృష్టికి తీసుకురావడం జరిగింది. 
మంత్రి బుగ్గన కు వినతుల వెల్లువ

వీటి పైమంత్రి బుగ్గన మాట్లాడుతూ ప్రజలు గ్రామాల్లో ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించే విధంగా పని చేయాలని అధికారులను,  నాయకులను సూచించారు.  అంతకుముందు గతంలోమూతపడిన బీసీ వెల్ఫేర్ బాలికల వసతి గృహాన్ని మంత్రి,  ఆర్. డి. ఓ వెంకటేశ్వర్లు, బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ కుమారి మయూరి లతో కలిసి కలసి ప్రారంభించారు.  ఈ సందర్భంగావిద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ విద్యార్థులు ప్రభుత్వం కల్పిస్తున్న పథకాలను వినియోగించుకొని చక్కగా చదువులో రాణించాలని ఆయన సూచించారు. కార్యక్రమాలలోఎం. ఆర్. ఓ విద్యాసాగర్,  ఎం. పీ. డీ. వో అశ్విని కుమార్,  ఈ. వో జితేంద్ర, వైయస్ ఆర్ సిపి మండల స్థాయి నాయకులు తదితరులు పాల్గొన్నారు

No comments:
Write comments