ఏపీలో విచిత్రమైన పాలిట్రిక్స్

 

విజయవాడ, అక్టోబరు 23 (globelmedianews.com)
ఏపీలో విచిత్రమైన రాజకీయం సాగుతోంది. ఏ పార్టీలో ఉన్నవారు ఆ పార్టీకి కట్టుబడి ఉంటే అది పాలిట్రిక్స్ ఎలా అవుతుంది. ఒక పార్టీలో ఉంటూ మరో పార్టీ స్నేహాన్ని కోరుతూ వారి కోసం పనిచేయడం వల్లనే బీజేపీ లాంటి జాతీయ పార్టీ దశాబ్దాలు గడచినా ఏపీలో ఎత్తిగిల్లకుండా పోయింది. ఇప్పటికి ఎన్ని అనుకూల పవనాలు వీచినా, మరెన్ని రకాలుగా అవకాశాలు దక్కినా కూడా వాటినన్నిటినీ టీడీపీ మేలు కోసమే ఉపయోగిస్తూ తోకపార్టీగా ఉండేందుకు కొందరు బీజేపీ నేతలు ఇష్టపడడం వల్లనే ఏపీలో కాషాయం పార్టీ కషాయం తాగాల్సివచ్చింది. ఎట్టకేలకు ఆ నిజాన్ని తెలుసుకున్న హై కమాండ్ టీడీపీని ఎలిమినేట్ చేస్తేనే తప్ప కమలం వికసించదని గట్టిగా భావిస్తోంది.ఏపీలో బీజేపీ టీడీపీ బంధం పై వస్తున్న వార్తలు, జరుగుతున్న ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టాలని బీజేపీ హై కమాండ్ భావించినట్లుంది.
ఏపీలో విచిత్రమైన పాలిట్రిక్స్

 దానికి అనుగుణంగానే ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు ఏపీకి వచ్చి మరీ పార్టీ లైన్ ఇదీ అని క్లారిటీగా చెప్పేశారు. టీడీపీ దగ్గర ఏముంది కలవడానికి అని కూడా ఆయన సెటైర్లు వేశారు. బాబు విశ్వసనీయత లేని నాయకుడని, టీడీపీకి చిత్తశుద్ధి లేదని కూడా ఆయన హాట్ కామెంట్స్ చేశారు. టీడీపీని విలీనం చేస్తానంటే తానే స్వయంగా మాట్లాడుతానని కూడా జీవీఎల్ వేసిన సెటైర్లు తమ్ముళ్ళకు గుక్క తిప్పుకోలేని వ్యవహారమే. ఈ నేపధ్యంలో టీడీపీ నుంచి బీజేపీలోకి జంప్ చేసిన సుజనా చౌదరి మీద కూడా జీవీఎల్ కొన్ని కామెంట్స్ చేయడం విశేషం. ఇక జీవీఎల్ బాటలోనే పార్టీ ప్రెసిడెంట్ కన్నా లక్ష్మీ నారాయణ సైతం టీడీపీకి డోర్స్ క్లోజ్ అనేశారుఅయితే ఇది వ్యూహాత్మకమైనదా లేక బీజేపీ పూర్తిగా ఇదే రకమైన స్టాండ్ తో ఉందా అన్న డౌట్లు కూడా ఉన్నాయి. అయితే ఏపీలో బీజేపీ బలం ఇప్పటికిపుడు పెరిగింది ఏదీ లేదని ఇదే జీవీఎల్ చెప్పడమూ గమనించాలి. పదిమంది నాయకులు టీడీపీ నుంచి వచ్చి చేరితే బీజేపీ బలపడుతుందని తాను అనుకోవడంలేదని ఆయన స్పష్టంగా చెప్పేశారు. అయితే పార్టీని జనంలోకి తీసుకువెళ్ళడం ద్వారానే ఏపీలో కమల వికాసం సాధ్యమని కూడా అయన దిశానిర్దేశమే చేశారు. ఇక టీడీపీతో పొత్తు అంటూ ఉంటే ఇతర పార్టీల నుంచి వలసలు నిలిచిపోతాయేమోనని హైకమాండ్ జీవీఎల్ చేత ఈ రకంగా క్లారిటీ ఇప్పించిందని కూడా అంటున్నారు.మరో వైపు బాబు విషయంలో బీజేపీ ఏమనుకుంటుందో ఇప్పటికైతే ఏ రకమైన స్పష్టతా లేదని కూడా అంటున్నారు. కానీ ఓ పార్టీగా బీజేపీ పుంజుకుంటేనే రేపటి రోజున రాయబేరాలు కానీ, బేరసారాలు కానీ చేసేందుకు అప్పర్ హ్యాండ్ అవుతామన్న ఉద్దేశ్యంతోనే ఇలా ప్రకటనలు చేస్తున్నారని బీజేపీలో బాబు గారి భక్తులు భావిస్తున్నారుట. అయితే వారికి మాత్రం బీజేపీ బలం కంటే బాబు బలమే బాగుందనిపిస్తోందని టాక్. అందుకే గతంలో ఏపీలో చక్రం తిప్పిన బాబు సామాజికవర్గం నేతలు మాత్రం జీవీఎల్ కామెంట్స్ తో ఏకీభవించకపోగా పూర్తి సైలెంట్ గా ఉంటున్నారు. దేశంలో ఎక్కడైనా మోడీ కానీ ఏపీలో మాత్రం మా బాబే అనే బాపతు బీజేపీలో ఉన్నంతవరకూ ఆ పార్టీ ఎదుగుదల కష్టమని కాషాయదళంలో నాయుడు గారి వ్యతిరేకులు అంటున్నారు. మొత్తానికి ఏపీ బీజీపీలో చీలిక మాత్రం స్పష్టం. అదీ బాబు విషయంలో కావడం టీడీపీకి మహా ఇష్టంగా ఉందిట.

No comments:
Write comments