టీఎస్ ఆర్టీసీ కార్మికులకు సిఐటియు ఎస్ఎఫ్ఐ సంఘాలు మద్దతు

 

అక్టోబర్ 7, (globelmedianews.com)
టీఎస్ ఆర్టీసీ కార్మికులకు పూర్తి మద్దతు ప్రకటిస్తూ సీఐటీయూ ఎస్ఎఫ్ఐ సంఘాల నాయకులు సోమవారం కోరుట్ల జేఏసీ ఆర్టీసీ కార్మికులు కార్గిల్ చౌరస్తా వద్ద నిరసన తెలుపుతున్న కార్మికులకు మద్దతు తెలిపారుఈ సందర్భంగా సి ఐ టి యు జిల్లా కన్వీనర్ జి తిరుపతి నాయక్ ఎస్ఎఫ్ఐ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు మొహమ్మద్ సుజాయిత్ అలీ మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికుల న్యాయ పరమైన సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకోవాలని డిమాండ్ చేశారు. 
టీఎస్ ఆర్టీసీ కార్మికులకు సిఐటియు ఎస్ఎఫ్ఐ సంఘాలు  మద్దతు

దసరా పండుగను దృష్టిలో ఉంచుకొని ప్రజలు ప్రయాణికుల ఇబ్బందులను గుర్తించాలని రోజు రోజు సమ్మె కారణంగా ప్రైవేట్ వాహనాలు విచ్చలవిడిగా ప్రయాణికుల నుండి డబ్బులు వసూలు చేయడం జరుగుతుందని వెంటనే కార్మిక నేతలతో సమావేశం నిర్వహించి వారి సమస్య పరిష్కారానికి ప్రభుత్వం చొరవ తీసుకోవాలని కోరారు లేనియెడల అన్ని వామపక్ష సంఘాల ఆధ్వర్యంలో ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జేఏసీ కన్వీనర్ బాసల రాజా గంగారాం,జీపీ సింగ్ నాయక్,సజ్జ, నరసయ్య కార్మికులు రావు ,రామ్, ప్రవీణ్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.

No comments:
Write comments