తూర్పులో భారీ వర్షాలు

 

కాకినాడ అక్టోబరు 24 (globelmedianews.com)
ఏపీలో భారీ వర్షాలు రహదారిపై తీవ్ర ప్రభావాన్ని చూపి స్తున్నాయి. తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం అన్నవరం గ్రామం జాతీయ రహదారిపై డిగ్రీ కళాశాల సమీప బైపాస్ రోడ్డుపైకి పంపా నది వరద నీరు చేరింది. 
తూర్పులో భారీ వర్షాలు

పంపానదికి వరద ఉధృతి ఎక్కువ వడంతో ఐదు గేట్లలో మూడు గేట్లను అడుగు మేర ఇరిగేషన్ అధికారులు పైకి లేపారు. దీంతో ట్రాఫిక్ ను ముందు జాగ్రత్త చర్యగా అన్నవరం గ్రామం మీదుగా మళ్లించారు. జాతీయ రహదారి ఉన్నతాధికారుల ఆదేశాలతో వరద నీరు చేరిన ప్రాంతానికి చేరుకుని ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు అధికారులు.

No comments:
Write comments