సీఆర్ ఫామ్ హౌజ్ లో పోలీసు ఆత్మహత్య

 

గజ్వెల్  అక్టోబరు 16, (globelmedianews.com)
ముఖ్యమంత్రి కేసీఆర్ ఫామ్ హౌజ్ లో ఒక పోలీసు ఆత్మహత్య చేసుకున్నాడు.  ఎర్రవల్లి ఫామ్ హౌజ్ వెస్ట్ గేట్ దగ్గ భద్రతా విధులు నిర్వహిస్తున్న హెడ్ గార్డ్ వెంకటేశ్వర్లు తన దగ్గరున్న ఏకే 47 తుపాకి తో కాల్చుకున్నాడు.  యాదాద్రి జిల్లా వలిగొండకు చెందిన వెంకటేశ్వర్లు  12 వ బెటాలియన్ లో పని చేస్తున్నాడు. 
వ్యవసాయ అనుబంధ రంగాలకు ప్రభుత్వం పెద్ద పీట

కాల్పుల శబ్దం విని అక్కడి సిబ్బంది ఆయనను  గజ్వేల్ ఆసుపత్రికి తరలించినప్పటికీ లాభం లేకుండా పోయింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన ప్రాణాలు కోల్పోయారు. అతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.ఘటనపై జిల్లా ఎస్పీ జోయల్ డేవిస్ మాట్లాడుతూ మద్యం మత్తు లో ఉన్న హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు ఆత్మహత్యకు పాల్పాడ్డాని అన్నారు. గతకొంతకాలం గా  విధుల కు సరిగా హాజరు అవని వెంకటేశ్వర్లు, ఇటీవల  భార్య విజ్ఞప్తి తో తిరిగి విధుల్లో చేరాడని అన్నారు.

No comments:
Write comments