షాద్ నగర్ పోలీసుల అదుపులోఉద్యమ కారులు

 

షాద్ నగర్ అక్టోబరు 18, (globelmedianews.com)
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలో శుక్రవారం ఉదయం  ఉద్యమకారులైన సిపిఐ శీను నాయక్, ఎస్ఎఫ్ఐ ప్రశాంత్, శివ శంకర్, ఏఐఎస్ఎఫ్ పవన్, టీవీవి ప్రవీణ్, జీవిఎస్ శీను నాయక్, వినోద్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉదయాన్నే వారి ఇండ్లకు చేసరుకున్న పోలీసులు అందరిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ. 
షాద్ నగర్ పోలీసుల అదుపులోఉద్యమ కారులు

అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరని గత 13 రోజులుగా జరుగుతున్న ఆర్టీసీ కార్మికులకు మేమంతా మద్దతు తెలుపుతున్నందున ఈరోజు ముందస్తుగా అరెస్టు చేసి స్టేషన్కు తరలించడం జరిగిందని అన్నారు. తెలంగాణలో బంగారు తెలంగాణ వస్తుందనుకుంటే బానిస తెలంగాణ వచ్చిందని, రాష్ట్రంలో కార్మికుల డిమాండ్లు పట్టించుకోకుండా చర్చలు పెట్టకుండా బెదిరించడం సరైన పద్ధతి కాదని, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, ప్రైవేటీకరణను మానుకోవాలని, ఆర్టీసీ  సమస్య పరిష్కారం అయ్యేంతవరకు పోరాటం కొనసాగిస్తామని వారు హెచ్చరించారు.

No comments:
Write comments