తిరుమలకు భక్తుల పోటు

 

తిరుమల అక్టోబరు 12, (globelmedianews.com)
తిరుమలకు శనివారం భక్తుల తాకిడి ఎక్కువైంది. వారంతాపు సేవలు కావడంతో అధిక సంఖ్యలో స్వామి వారి దర్శనానికి తరలి వస్తున్నారు. ఎటు చూసినా భక్తులతో తిరుమల ఏడు గిరులు కిటకిటలాడుతోంది. అద్దె గదులు, లాకర్లు, తలనీలాలు కోసం భక్తులు  బారులు తీరారు. ప్రస్తుతం వైకుంఠం ఒకటి రెండు లోని అన్ని కంపార్ట్ మెంట్లు నిండి లేపాక్షి కూడలి వరకు భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచి ఉన్నారు. 
తిరుమలకు భక్తుల పోటు

వీరికి సుమారు 24 నుండి 30 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు చెబుతున్నారు. దీంతో తిరుమల పరిసర ప్రాంతాల్లోనే భక్తులు సేదదీరుతున్నారు. మరో పక్క ప్రతిరోజు కేటాయించే దివ్య దర్శనమ్, టైమ్ స్లాట్ దర్శనమ్ టోకెన్ల తో పాటు ప్రజాప్రతినిధుల లేఖలకు కేటాయించే దర్శనాలను కూడా రద్దు చేసి ప్రోటోకాల్ పరిధిలో ఉండే ప్రముఖులకు మాత్రమే టీటీడీ దర్శనాలు కేటాయించింది. క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులకోసం టీటీడీ అన్న ప్రసాధాలను అందిస్తున్నారు.

No comments:
Write comments