జగన్‌పై అఖిలప్రియ ఫైర్

 

కర్నూలు, అక్టోబర్ 25,  (globelmedianews.com)
ముఖ్యమంత్రి జగన్‌పై మాజీ మంత్రి అఖిలప్రియ మండిపడ్డారు. వైసీపీ సర్కార్ అన్న క్యాంటీన్‌లను మూసివేసి పేద ప్రజల కడుపు కొడుతోందని ధ్వజమెత్తారు. ఇసుక మాఫియాపై నిరసన తెలుపుతూ ఆళ్లగడ్డ పట్టణంలోని నాలుగు రోడ్ల కూడలిలో టీడీపీ ఆధ్వర్యంలో అఖిలప్రియ మానవహారం నిర్వహించారు. 
జగన్‌పై అఖిలప్రియ ఫైర్

అక్కడి నుంచి ర్యాలీగా వెళ్లి తహశీల్డారుకు వినతి పత్రం అందజేశారు. ఏపీలో ఇసుక కొరత తీవ్రరూపం దాల్చడంతో భవన నిర్మాణ కార్మికులు రోడ్డెక్కారు. డిమాండ్‌కు తగ్గట్లుగా ఇసుకను అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేశారు.

No comments:
Write comments