పర్యావరణ సంరక్షణ ప్రతిఒక్కరి బాధ్యత

 

విజయవాడ అక్టోబర్ 02  (globelmedianews.com)
నిత్యజీవనంలో కొన్ని జాగ్రత్తలను పాటిస్తూ ప్రతిఒక్కరు పర్యావణ సమతుల్యానికి కృషి చేయాలని సీనియర్ ఐఏఎస్ అధికారి  రాష్ట్రప్రభుత్వ రవాణాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరి , ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ మొవ్వా తిరుమల కృష్ణ బాబు సూచించారు . బుధవారం ఉదయం పిడబ్ల్యుడి గ్రవుండ్స్ స్వరాజ్యమైదానం రైతు బజార్ ప్రాంగణంలో మోహన్ స్పిన్ టెక్స్ ఇండియా లిమిటెడ్ వారి ఆధ్వర్యంలో చేతిసంచుల పంపిణీ కార్యక్రమాన్ని అయన లాంఛనంగా ప్రారంభించారు . రైతు బజారుకు కూరగాయలను కొనుగోలు చేయడానికి వచ్చిన వారికి గుడ్డతో తయారైన సంచులను అయన స్వయంగా అందించారు .
పర్యావరణ సంరక్షణ ప్రతిఒక్కరి బాధ్యత

ఈ సందర్బంగా కృష్ణ బాబు మాట్లాడుతూ పర్యావరణం రోజురోజుకు ప్రమాదస్థాయికి వెళ్తోందని , మనందరం కలిసి కృషిచేస్తే పర్యవరణంలో సమతుల్యం సాదించవచ్చునన్నారు . అభివృధ్ధి చెందిన దేశాలు పర్యావరణ సమతుల్యం విషయంలో కూడా ముందుంటున్నాయన్నారు . భారత దేశం లో కూడా స్వచ్ఛభారత్ కార్యక్రమంలో పర్యావరణానికి ప్రమాదకారిగా ఉంటున్న ప్లాస్టిక్ వస్తువుల వినియోగాన్ని పూర్తిగా మానేయాల్సిన అవసరం వచ్చిందన్నారు . రాష్ట్ర ప్రభుత్వం ఈదిశగా అడుగులువేస్తూ ప్రభుత్వకార్యాలయాల్లో ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించిందన్నారు. జయంతి ని పురస్కరించుకుని ఈరోజు మోహాన్ స్పిన్ టెక్స్ ఆధ్వర్యంలో ఈక్రమంలోనే వస్త్రంతో తయారైన చేతిసంచులను వినియోగించమని కోరుతూ ఉచితంగా పంపిణీ చేయడం అభినందనీయమన్నారు ఈకార్యక్రమంలో మోహన్ స్పిన్ టెక్స్ ఇండియా లిమిటెడ్ ప్రతినిధులు జి .రవి కుమార్ , కృష్ణా రావు , జివి లలిత ప్రసాద్ , రాఘవేంద్ర రావు తదితరులు పాల్గొన్నారు .

No comments:
Write comments